ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు
top news
author img

By

Published : Dec 6, 2022, 6:59 PM IST

  • పని చేసుకోమంటూ.. విసిగిస్తున్నాడని.. తాతను చంపిన మనవడు..!
    కర్నూలు నగరంలో ఈనెల మూడవ తేదీ జరిగిన సుబ్రహ్మణ్యం శర్మ హత్య కేసును పోలీసులుఛేదించారు. మనవడు దీపక్ శర్మ ఎలాంటి పనులు చేయకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడంతో సుబ్రహ్మణ్య శర్మ మందలించడంతో.. దీపక్​ శర్మ హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికలకు సిద్ధం కావాలన్న హైకోర్టు...
    బార్ అసోసియేషన్ కార్యవర్గం గడువు ముగిసినా ఎన్నికలు జరపటం లేదంటూ న్యాయవాది విజయభాస్కర్ హైకోర్టులో వేసిన పిటీషన్​పై ఈరోజు హై కోర్టు విచారణ చేపట్టింది. ఏడుగురు న్యాయవాదులతో అడహాక్ కమిటీని బార్ కౌన్సిల్ చైర్మన్ ఏర్పాటు చేయటంపై హైకోర్టు స్టే ఇచ్చింది. న్యాయవాదుల ఎన్నికలకు సిద్ధం కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈ నెల 11న ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం నమోదు చేస్తాం: సీబీఐ
    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత మెయిల్‌కు సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు. ఈ నెల 11న విచారణ జరిపేందుకు సీబీఐ అంగీకరించింది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు వాంగ్మూలం నమోదు చేస్తామని సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అటవీశాఖ అధికారిపై ఇసుక మాఫియా దాడి
    అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో ఇసుక అక్రమ వ్యాపారులు దౌర్జన్యం చేశారు. ఏకంగా అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. ఈ సంఘటన మదనపల్లి మండలం సీటీఎం సమీపంలో తుమ్మ కొండ ప్రాంతంలో జరిగింది. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నడిరోడ్డుపై 20 సార్లు రాయితో కొట్టి యువకుడి హత్య.. కన్నకొడుకునే సుపారీ ఇచ్చి..
    వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడిని ఆరుగురు కలిసి రాయితో కొట్టి హత్యచేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో వెలుగుచూసింది. మరోవైపు, సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన దారుణం హుబ్లీలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వాడీవేడిగా శీతాకాల సమావేశాలు.. రిజర్వేషన్లు, ధరల పెరుగుదలపై నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం..
    పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయి. ఈనెల 29 వరకు జరిగే ఈ సమావేశాలపై గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఇదే సమయంలో సరిహద్దుల్లో చైనా దురాక్రమణలు, ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం, రూపాయి విలవ పతనం, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు నిషేధం!.. కారణం ఇదే..
    స్విట్జర్లాండ్​ను విద్యుత్​ సంక్షోభం తీవ్రంగా పట్టిపీడిస్తోంది. ఈ కారణంగా ఆ దేశ అధికారులు ఎలక్ట్రిక్ వాహనాలను నిషేధించే ప్రతిపాదనను రూపొందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలు చేస్తే.. అలా చేసిన మొదటి దేశం స్విట్జర్లాండ్ అవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మారుతీ సుజుకీ ఓనర్లకు అలర్ట్​.. ఈ మోడళ్ల కార్లు రీకాల్
    దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. సీటు బెల్ట్​లలో లోపాలను సరిచేయడానికి సియాజ్,​ బ్రెజ్జా, ఎర్టిగా ఎక్స్​ఎల్​ 6, గ్రాండ్​ విటారా మోడళ్లకు చెందిన 9125 కార్లను రీకాల్ చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈ ఆరుగురు ఫేమస్​ క్రికెటర్ల బర్త్​ డే ఒకే రోజు వారెవరో తెలుసా"
    తమకు ఇష్టమైన క్రికెట్​ ప్లేయర్ల బర్త్​ డేలకు అభిమానులు​ చేసే హంగామా అంతా ఇంతా కాదు. కేక్​లు కట్​ చేసి సెలెబ్రేషన్స్​ చేస్తారు. అయితే అలా ఒకే రోజు అర డజను అభిమాన ప్లేయర్ల పుట్టిన రోజు అయితే ఫ్యాన్స్​ ఏం చేస్తారో కదా. ఈ విషయం ఇప్పుడు ఎందుకంటే ఆ ఆరుగురు ప్లేయర్ల పుట్టిన రోజు డిసెంబర్​ 6నే మరి. వారెవరో చూసేద్దామా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 2022 ఈ ఏడాది రీమేక్​ చిత్రాల్లో హిట్​ ఫ్లాప్​​ ఎన్నంటే
    రీమేక్‌ ఈ మధ్య సినిమా డిక్షనరీలో పదేపదే కనిపిస్తున్న పదం. మన దగ్గర బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సినిమాల్లోనూ రీమేక్‌ల హవా బాగానే ఉంది. చాలా మంది రీమేక్​ అంటే కాపీ పేస్ట్​ అంటూ విమర్శలు చేస్తుంటారు. కానీ అవి రూపొందించాలంటే పరభాషలో సినిమా విజయానికి కారణాలు ఏంటి, మన భాషలో విజయం సాధించడానికి అవసరమైన అంశాలు ఏంటి అని లెక్కలు వేసుకుని తీయాలి. అయితే ఈ ఏడాది చివరికి వచ్చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.