- సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందని వారికి నేడు నిధులు విడుదల.. బటన్ నొక్కనున్న జగన్
రాష్ట్రంలో ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల్లో లబ్ధి అందని వారికి నేడు ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. 2లక్షల 79 వేల 65 మంది లబ్ధిదారులకు 590 కోట్ల 91లక్షల రూపాయలను సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
- చెట్లును ధ్వంసం ఘటనలో.. ఎస్సీ, ఎస్టీ కేసుతో దిగివచ్చిన వైసీపీ నేతలు..
SC, ST case against YCP MLA relatives: ఆ మహిళ తన భూమిలో మామిడి చెట్లను నాటుకుంది. అధికార పార్టీకి చెందిన నేతలు ఆమె భూమిలోకి అక్రమంగా చొరబడి మామిడి చెట్లును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సమీప బంధువులతో పాటు ఏడుగురిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. చెట్లను ధ్వంసం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఎమ్మెల్యే దిద్దుబాటు చర్యలకు దిగారు దళిత మహిళలను పరామర్శించారు.
- తిరుమలకు మరో ఘనత.. దేశంలోనే ఎక్కువ సందర్శించిన దేవాలయాల్లో రెండో స్థానం
TIRUMALA TEMPLE SECOND PLACE : దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుపతి ఎంతో ప్రసిద్ధమైంది. తాజాగా అది మరో ఘనత దక్కించుకుంది. దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించిన క్షేత్రంగా రెండో స్థానంలో నిలిచింది.
- స్పల్పంగా తగ్గిన కరోనా కేసులు.. దేశవ్యాప్తంగా కొవిడ్ మాక్‌డ్రిల్
Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 157 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది.
- కర్ణాటకలో మరో పేలుడు.. కొరియర్ షాపులో మిక్సీ పేలి..
మిక్సీ పేలిన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
- నడి సంద్రంలో నరకం.. నెల రోజుల తర్వాత ఒడ్డుకు చేరిన రోహింగ్యా శరణార్థులు
బతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకుని పొరుగు దేశాలకు వలస వెళ్లాలనుకున్నా వారికి మార్గమధ్యంలోనే చేదు అనుభవం ఎదురైంది. పడవ ఇంజిన్ ఆగిపోయి ఆహారం, నీళ్లు లేక ఓ చిన్నపాటి పడవపైనే అండమాన్ సముద్రంలో నెలరోజులపాటు కొట్టుమిట్టాడిన ఓ రోహింగ్యా శరణార్థుల బృందం.. చివరకు ఇండోనేసియాకు చేరుకుంది.
- పారిశ్రామిక దిగ్గజం నుంచి రుణ ఎగవేతదారుగా.. వేణుగోపాల్ ధూత్ అధోగతి ఇలా
ఒకప్పుడు దేశంలోనే గొప్ప పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా నిలిచిన వీడియోకాన్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మోసపూరితంగా రుణం తీసుకొన్న కేసులో ఆయన సోమవారం అరెస్ట్ అయ్యారు. వీడియోకాన్ గ్రూపును వివిధ రంగాల్లో విస్తరించడంలో కీలక పాత్ర పోషించిన వేణుగోపాల్ రుణ ఎగవేతదారుగా ఎలా మారారో తెలుసుకుందాం..
- వందో టెస్టులో వార్నర్ రికార్డు సెంచరీ.. దిగ్గజాల సరసన చోటు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో మెరిశాడు. ఈ శతకంతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
- చిరంజీవి బాలకృష్ణలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా?
ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ. వీరిద్దరు ఈ సంక్రాంతికి ఒక్కరోజు వ్యవధిలో తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈ అగ్రహీరోలిద్దరిలో ఓ కామన్ క్వాలిటీ ఉంది. అదేంటో తెలుసా?