త్వరలో జరగబోయే పారాలింపిక్స్‌లో తనను ఎంపిక చేయకపోవడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు పారాలింపియన్ షూటర్ నరేశ్ కుమార్ శర్మ. ఐదు సార్లు పారాలింపిక్స్‌లో పాల్గొన్న తనను ఈసారి ఎంపిక చేయకపోవడంపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించుకున్నారు.
అంతకుముందు దిల్లీ హైకోర్టులో షూటర్ నరేశ్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ విచారణ ఆలస్యమై నేపథ్యంలో ఇప్పుడాయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. షూటర్ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం విచారణకు అంగీకరించింది.
తక్షణమే ఎంపిక చేయాలని అదేశం..
షూటర్ అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. పారాలింపిక్స్ బృందంలో నరేశ్ కుమార్ శర్మను తక్షణమే చేర్చుకోవాలని ఆదేశించింది. దీంతో టోక్యోలో ఈ నెలాఖరున ప్రారంభం కానున్న పారాలింపిక్స్‌లో పాల్గొననున్నారు.
ఇదీ చూడండి.. దుమ్మురేపిన మహిళల హాకీ జట్టు.. క్వార్టర్స్‌లో విజయం