టోక్యో పారాలింపిక్స్‌లో భారత్పతకాల పంట పండిస్తోంది. సోమవారం జరిగిన ఒక్క జావెలిన్ త్రో ఈవెంట్లోనే భారత్‌కు రజతం, కాంస్య పతకాలు దక్కాయి. F46 విభాగంలో 64.35 మీటర్ల దూరం విసిరి దేవేంద్ర ఝజారియా రజతాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో సుందర్ సింగ్.. 64.01 దూరం విసిరి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
సిల్వర్ మెడల్ సాధించిన దేవేంద్ర ఝజారియా 64.35 మీ., బ్రౌంజ్ మెడల్ విన్నర్ సుందర్ 62.58 మీ. దూరం ఈటెను విసిరారు. వీరిద్దరి కంటే మెరుగ్గా శ్రీలంకకు చెందిన దినేశ్ ప్రియన్ అత్యధికంగా 67.79 మీ. దూరం ఈటెను విసిరి బంగారు పతకాన్ని సాధించాడు.
ఈ సందర్భంగా దేవేంద్ర ఝజారియా, సుందర్ సింగ్‌లను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.
"దేవేంద్ర ఝజారియా నుంచి అద్భుతమైన ప్రదర్శన. అత్యంత అనుభవజ్ఞులైన అథ్లెట్లలో ఒకరు(దేవంద్ర) రజత పతకాన్ని సాధించారు. దేవేంద్ర భారతదేశాన్ని గర్వపడేలా చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు నా అభినందనలు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను".
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
"సుందర్ సాధించిన కాంస్య పతకంతో భారతదేశం సంతోషంగా ఉంది. అతను అద్భుతమైన ధైర్యం అంకితభావంతో ప్రదర్శన చేశాడు. ఈ సందర్భంగా అతడికి నా అభినందనలు. భవిష్యత్ ప్రణాళికల్లోనూ సుందర్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా" అని మోదీ ట్వీట్ చేశారు.