నీరజ్ చోప్డా.. ప్రస్తుతం దేశంలో మార్మోగిపోతున్న పేరు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా నిరీక్షించిన భారత్ కలను నెరవేర్చాడు ఘనుడు చోప్డా. జావెలిన్ త్రో ఫైనల్లో గెలిచిన ఇతడు మువ్వన్నెల జెండాకు పసిడి కాంతులద్దాడు. దీంతో ఇతడిపై యావత్ దేశమంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఇతడు విజయం సాధించి తిరిగి రాగానే ఒలింపిక్ గ్రామంలోని భారత శిబిరంలో ఉన్న మన అథ్లెట్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సంబురాలు చేసుకున్నారు. కేరింతలు కొడుతూ నీరజ్‌ను హత్తుకుని శుభాకాంక్షలు తెలుపారు. ప్రశంసలతో అతడిని ముంచెత్తారు. వీరిలో బాక్సింగ్ కోచ్ చోటే లాల్ యాదవ్, పురుషుల హాకీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూసేయండి..
-
Celebration at Olympic game village with Neeraj and other medalist’s @Neeraj_chopra1 @g_rajaraman pic.twitter.com/S6V1uQSERJ
— Chhote Lal boxing coach (@Chhoteboxingco1) August 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Celebration at Olympic game village with Neeraj and other medalist’s @Neeraj_chopra1 @g_rajaraman pic.twitter.com/S6V1uQSERJ
— Chhote Lal boxing coach (@Chhoteboxingco1) August 8, 2021Celebration at Olympic game village with Neeraj and other medalist’s @Neeraj_chopra1 @g_rajaraman pic.twitter.com/S6V1uQSERJ
— Chhote Lal boxing coach (@Chhoteboxingco1) August 8, 2021
భారత్‌కు ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా(2008) తర్వాత స్వర్ణం అందించిన రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్డా చరిత్ర సృష్టించాడు. ఆసియా, కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాలు ముద్దాడిన నీరజ్ ఒలింపిక్స్ అర్హత పోటీల్లోనూ అగ్రస్థానంలో నిలిచాడు. అతడు 2021 మార్చిలో 88.07మీ, 2018, ఆసియా క్రీడల్లో 88.06మీ, 2020 జనవరిలో దక్షిణాఫ్రికాలో 87.87 మీ, 2021 మార్చిలో ఫెడరేషన్ కప్‌లో 87.80మీ, 2018, మేలో దోహా డైమండ్ లీగ్‌లో 87.43 మీ, 2021 జూన్‌లో కౌరెటనె గేమ్స్‌లో 86.79మీటర్లు ఈటెను విసిరి రికార్డులు సృష్టించాడు.
ఇదీ చూడండి: Olympics: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్డా- భారత్‌కు స్వర్ణం