హాకీలో దూకుడు..
పురుషుల హాకీ పూల్ ఏ మ్యాచ్‌లో భారత్ దూకుడు ప్రదర్శించింది. జపాన్‌తో జరిగిన పోరులో 5-3 తేడాతో గెలుపొందింది.
16:28 July 30

14:52 July 30
సింధు విజయం..
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం సాధించింది. ప్రత్యర్థి జపాన్ క్రీడాకారణి యమగూచిపై 2-0 తేడాతో సెట్లను కైవసం చేసుకుంది. ముఖ్యంగా రెండో సెట్లో పోరు హోరాహోరీగా సాగింది. తొలి సెట్ సింధు గెల్వగా.. రెండో సెట్లోను దూకుడు ప్రదర్శించింది. కానీ యమగూచి అనూహ్యంగా పుంజుకుని పైచేయి సాధించింది. కానీ చివర్లో పట్టుబిగించిన సింధు మ్యాచ్‌ను నెగ్గింది. దీంతో ఈ తెలుగుతేజం సెమీస్‌కు దూసుకెళ్లింది.
14:13 July 30
సింధు దూకుడు..
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. దూకుడుగా ఆడుతోంది. క్వార్టర్ ఫైనల్లో జపాన్ షట్లర్ యమగూచితో తలపడుతున్న సింధు.. తొలి సెట్‌ను 21- 13తో కైవసం చేసుకుంది.
ప్రత్యర్థిని కోర్టు మొత్తం పరుగులు పెట్టిస్తోంది సింధు. పదునైన స్మాష్‌లతో అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తోంది. రియో ఒలింపిక్స్‌లో రజతం గెల్చిన సింధు.. ఈసారి స్వర్ణమే దిశగా దూసుకెళ్తోంది.
12:48 July 30
టార్గెట్ గోల్డ్..
మహిళల బాక్సింగ్ వెల్టర్ వెయిట్ విభాగంలో(69 కేజీలు).. సెమీఫైనల్ చేరిన భారత బాక్సర్ లవ్లీనా తన లక్ష్యం బంగారు పతకమేనని చెబుతోంది. ప్రస్తుతం తన దృష్టంతా గోల్డ్ మెడల్ సాధించడంపైనే ఉందని, సెమీఫైనల్ కోసం తీవ్రంగా శ్రమిస్తానని చెప్పుకొచ్చింది.
11:30 July 30
క్వార్టర్ ఫైనల్లో దీపిక ఓటమి..
ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో.. దీపిక ఓటమి పాలైంది. క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, కొరియా ఆర్చర్ అన్ సన్ చేతిలో 6-0 తేడాతో వరుస సెట్లలో ఓడింది. అన్ సన్ దూకుడు ముందు.. దీపిక కనీసం పోటీ ఇవ్వలేకపోయింది.
10:51 July 30
మహిళల హాకీలో ఓ విజయం..
మహిళల హాకీ పూల్ ఏ భారత్ ఓ విజయం సాధించింది. ఐర్లాండ్‌పై 1-0 తేడాతో గెలిచింది. నవనీత్ కౌర్ 57వ నిమిషంలో చేసిన గోల్‌తో భారత్ ఆధిక్యంలో నిలిచి.. మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లాడిన భారత్.. గ్రేట్బ్రిటన్, జర్మనీ, నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. తరువాతి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో ఆడనుంది టీమ్ ఇండియా.
భారత్‌కు క్వార్టర్ ఫైనల్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.
10:10 July 30
సెయిలింగ్..
సెయిలింగ్‌లో వరుణ్ టక్కర్, కేసీ గణపతి.. 49er పురుషుల ఏడో రేసును 17వ స్థానంతో ముగించారు.
10:07 July 30
అథ్లెటిక్స్‌లో ప్చ్..
పురుషుల 400 మీ. హర్డిల్స్‌లో భారత అథ్లెట్ ఎంపీ జబీర్ 50.77 టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచాడు.
అంతకుముందు 100 మీ. పరుగులో ద్యుతి చంద్, 3000 మీ. స్టీపుల్ ఛేజ్ హీట్స్‌లో అవినాశ్ సాబ్లే ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.
09:48 July 30
మీరాబాయికి స్వర్ణావకాశం లేదు..
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను.. బంగారు పతకం వచ్చే అవకాశాల్లేవు. 49 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచిన.. చైనా వెయిట్ లిఫ్టర్ జిహుయ్ హౌకు డోపింగ్ టెస్టులు చేయనున్నారని, అందులో పాజిటివ్‌గా తేలితే.. మీరాకు స్వర్ణం దక్కుతుందని వార్తలొచ్చాయి.
అయితే.. ఇందులో నిజం లేదని అధికారులు తేల్చారు. అది పొరపాటుగా జరిగిందని, డోప్ టెస్టుల గురించి ప్రస్తావనే రాలేదని తెలిసింది.
ఫైనల్లో.. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగాల్లో 210 కేజీల బరువును ఎత్తి కొత్త ఒలింపిక్స్ రికార్డును సృష్టించింది చైనా రెజ్లర్ జిహుయ్ హౌ. మీరాబాయి 202 కేజీలను ఎత్తి.. రజతం గెల్చింది.
09:24 July 30
ద్యుతికి నిరాశ..
అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. స్టీపుల్ చేజ్లో ఇప్పటికే సాబ్లె సెమీఫైనల్‌కు అర్హత సాధించకపోగా.. ఇప్పుడు మహిళల 100 మీ. పరుగులో ద్యుతి చంద్ విఫలమైంది. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.
08:53 July 30
మరో మెడల్..
ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో మెడల్ ఖాయమైంది. మహిళల బాక్సింగ్ వెల్టర్ వెయిట్(69 కేజీలు) విభాగంలో.. సెమీఫైనల్‌కు చేరింది లవ్లీనా బోర్గోహైన్. క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ బాక్సర్.. చెన్-చిన్ను 4-1 తేడాతో చిత్తుగా ఓడించింది.
సెమీఫైనల్లో.. టర్కీ బాక్సర్ సుర్మేనేలి బుసానాజ్తో తలపడనుంది. అందులో గెలిస్తే.. ఫైనల్‌కు చేరుతుంది. ఓడినా.. ఆమెకు కాంస్యం దక్కుతుంది.
08:34 July 30
బాక్సర్ సిమ్రన్‌జీత్ ఓటమి..
మహిళల 60 కేజీల లైట్ వెయిట్ విభాగంలో.. భారత బాక్సర్ సిమ్రన్‌జీత్ కౌర్ ఓటమిపాలైంది. థాయ్‌లాండ్ బాక్సర్ సీసోండీ చేతిలో 5-0 తేడాతో ఓడి.. ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది.
07:17 July 30
మను బాకర్‌కు నిరాశ..
షూటింగ్లో ఆశలు పెంచిన మను బాకర్ మళ్లీ ఫైనల్ చేరడంలో విఫలమైంది. తుది 8 మందిలో నిలవలేకపోయింది. 600 పాయింట్లకుగానూ 582 స్కోరు చేసింది. క్వాలిఫికేషన్ ప్రెసిషన్‌లో 292 స్కోరు చేసిన మను.. ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో 2 పాయింట్లు తక్కువ చేసింది.
06:46 July 30
సర్నోబత్కు నిరాశే..
షూటింగ్ మహిళల 25 మీ. పిస్టల్ విభాగంలో.. భారత షూటర్ రహి సర్నోబత్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. 600 పాయింట్లకుగానూ.. 573 స్కోరు మాత్రమే చేసింది. మను బాకర్ ఇంకా పోటీపడాల్సి ఉంది. ఆమెకు మంచి అవకాశాలే ఉన్నాయి.
06:35 July 30
స్టీపుల్ ఛేజ్‌లో జాతీయ రికార్డు..
అథ్లెటిక్స్ పురుషుల 3000 మీ. స్టీపుల్ ఛేజ్ హీట్స్‌లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లె.. సెమీఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. హీట్-2 లో పోటీపడ్డ సాబ్లె.. 8:18:12 నిమిషాల్లో పరుగును పూర్తి చేశాడు. అది జాతీయ రికార్డు కావడం విశేషం.
అంతకుముందు సాబ్లె.. అత్యుత్తమ టైమింగ్ 8.20.20గా ఉండేది.
06:04 July 30
Olympics Live: ఆర్చరీ క్వార్టర్స్‌లో దీపికా కుమారి
ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్, ప్రపంచ నెం.1 దీపికా కుమారి.. మహిళల వ్యక్తిగత విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. రష్యా ఒలింపిక్ కమిటీ(ఆర్ఓసీ) క్రీడాకారిణిపై 6-5 తేడాతో గెలిచింది.
మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. తొలి సెట్ దీపికా కుమారి నెగ్గగా.. రెండో సెట్ ప్రత్యర్థి గెలిచింది. మూడో సెట్ మళ్లీ దీపికా నెగ్గింది. నాలుగో సెట్ టై అయింది. ఐదో సెట్ ప్రత్యర్థికే దక్కగా.. స్కోరు 5-5తో సమమైంది. షూట్ ఆఫ్‌లో రష్యా ఆర్చర్ 7 పాయింట్ల స్కోరే చేయగా.. దీపికా 10 పాయింట్లు సాధించి మ్యాచ్ గెలిచింది.