టాప్‌సీడ్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్.. ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌కు దూరం కానున్నాడు. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన జకో, అమెరికాలో కేసులు విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒకవేళ ప్రేక్షకులు లేకుండా టోర్నీ జరిగినా ఆడే ఆలోచన లేదని భావిస్తున్నాడు.
"ప్రస్తుతం అమెరికాలో తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. టోర్నీ జరుగుతుందని అనుకోవడం లేదు. నేను మాట్లాడిన వారిలో చాలామంది ప్లేయర్లు అక్కడికి(న్యూయార్క్) వెళ్లేందుకు ఇష్టంగా లేరు. అయితే సెప్టెంబరుకు వాయిదా పడ్డ ఫ్రెంచ్ ఓపెన్ జరగొచ్చనిపిస్తోంది" -జకోవిచ్, ప్రముఖ టెన్నిస్ ఆటగాడు
షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31న యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రా ప్రారంభం కావాల్సి ఉంది. ప్రాణంతక కరోనా కారణంగా ఇప్పటికే వింబుల్డన్ రద్దవగా, గత వారం ముగియాల్సిన ఫ్రెంచ్ ఓపెన్.. సెప్టెంబరుకు వాయిదా పడింది. అయితే రోజురోజుకు పరిస్థితులు విషమిస్తున్న నేపథ్యంలో ఇది జరుగుతుందా? లేదా? అనేది సందేహమే.
ఇవీ చదవండి: