ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్ ఘనంగా ముగిశాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలంక బృందంలోని 10 మంది సభ్యులు అదృశ్యమైన సంఘటన మరవకముందే.. ఇప్పుడు మరో ఇద్దరు ప్లేయర్స్ కూడా మిస్ అయ్యారని తెలిసింది. కామన్వెల్త్లో పాల్గొన్న పాకిస్థాన్‌కు చెందిన బాక్సర్లు సులేమాన్ బలోచ్, నజీరుల్లాఖాన్ తిరిగి ప్రయాణమయ్యే సమయంలో అదృశ్యమయ్యారని పాకిస్థాన్ బాక్సింగ్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పీబీఎఫ్.. బర్మింగ్‌హామ్ పోలీసుల సహకారంతో ఆ ఇద్దరి ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నారు.
ఇస్లామాబాద్ ఫ్లైట్ ఎక్కేందుకు కేవలం రెండు గంటల ముందుగానే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. దీంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు వారిద్దరు చివరిసారిగా ఎవరితో మాట్లాడారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రెండు నెలల క్రితం హంగేరీలో ఫినా వరల్డ్ ఛాంపియన్ షిప్లో కూడా పాల్గొనాల్సిన పాకిస్థాన్‌కు చెందిన స్విమ్మర్ ఫైజాన్ అక్బర్ మిస్సయ్యాడు. అతడి ఆచూకి ఇప్పటి వరకు దొరకలేదు.
ఇదీ చూడండి: ఆ హీరోయిన్ను చూస్తే జాలేస్తుంది.. ఫేమ్ కోసం మరీ ఇంతలా.. పంత్ ఆవేదన!