ETV Bharat / sports

Asian Games Ind Vs Pak : ఉత్కంఠ పోరులో పాక్​పై భారత్ ఘన విజయం.. స్వర్ణ పతకం కైవసం - Asian Games Hockey 2023

Asian Games Ind Vs Pak Squash : ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా జరిగిన ఉత్కంఠ పోరులో ఇండియా.. పాకిస్థాన్​ను ఓడించి గోల్డ్​ మెడల్ సాధించింది. ఆ వివరాలు..

Asian Games Ind Vs Pak : పాకిస్థాన్​పై భారత్ ఘన విజయం.. స్వర్ణ పతకం కైవసం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 3:50 PM IST

Updated : Sep 30, 2023, 8:29 PM IST

Asian Games Ind Vs Pak Squash : ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇండియా పతకాల జోరును కొనసాగిస్తోంది. తాజాగా మరో గోల్డ్​ మెడల్​ను ఖాతాలో వేసుకుంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల స్కాష్​ జట్టు ఫైనల్​లో 2-1తేడాతో పాకిస్థాన్​ను ఓడించి స్వర్ణాన్ని ముద్దాడింది. సౌరవ్ ఘోషల్​, అభయ్ సింగ్​, మహేశ్​ మాంగా, సంధు హరీందర్ కూడిన బృందం ఈ పతకాన్ని అందుకుంది. అసలు ఒకానొక దశలో ఇండియా కేవలం సిల్వర్ మెడల్​కే పరిమితమవుతుందా..? అని అనిపించింది. కానీ కీలక రౌండ్‌లో భారత ప్లేయర్ అభయ్‌ సింగ్‌ చివరి వరకు పోరాడి జట్టుకు విజయాన్ని అందించాడు.

మొత్తం ఐదు గేముల్లో ఇండియా - పాకిస్థాన్​ చెరో రెండేసి విజయాలు సాధించాయి. దీంతో చివరి రౌండ్‌ కీలకంగా మారింది. అయితే ఆఖరి రౌండ్​లో పాకిస్థాన్​ ప్లేయర్ నూర్ జమాన్‌పై అభయ్‌ 12-10 పాయింట్ల తేడాతో గెలిచాడు. దీంతో భారత్ 3-2 తేడాతో పాక్​పై గెలిచి గోల్డ్​ మెడల్​ను తన ఖాతాలో వేసుకుంది. కాగా, భారత్‌ చివరిసారిగా 2014 ఆసియా క్రీడల్లో స్క్వాష్‌లో విజయం సాధించింది. మొత్తంగా ఈరోజు టీమ్‌ఇండియాకు ఇది రెండో గోల్డ్ మెడల్ కావడం విశేషం. అంతకుముందు టెన్నిస్‌లో రోహన్ - రుతుజ జోడీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్​లో గోల్డ్​ మెడల్​ను దక్కించుకుంది.

Asian Games 2023 India Medals List : దీంతో ప్రస్తుతం ఇండియా ఖాతాలో మొత్తం 36 మెడల్స్ వచ్చి చేరాయి. ఇందులో 10 గోల్డ్ మెడల్స్​, 13 సిల్వర్ మెడల్స్​, 13 బ్రాంజ్ మెడల్స్​ ఉన్నాయి. ఇక ఈ పతకాలతో... మెడల్స్​ టేబుల్​లో నాలుగో స్థానంలో భారత్​ కొనసాగుతోంది. ఇంకా బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, బ్యాడ్మింటన్ విభాగాల్లోనూ మెడల్స్​ వచ్చే ఛాన్స్​ ఉంది.

Asian Games Hockey 2023 : ఇకపోతే హాకీ మెన్స్​ పూల్​ ఏ మ్యాచ్​లో పాకిస్థాన్​పై టీమ్​ఇండియా అదిరిపోయే ఘన విజయాన్ని అందుకుంది. ఏకంగా 10-2తేడాతో గెలుపును ఖాతాలో వేసుకుంది.

Last Updated : Sep 30, 2023, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.