World Cup 2023 Australia Squad : 2023 ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును బుధవారం ఫైనలైజ్ చేసింది. ఈ మెగాటోర్నీ కోసం ఆసిస్.. గతనెల 18 మందితో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను 15కు కుదించింది. తాజాగా ప్రకటించిన జట్టులో.. ఆల్ రౌండర్ అరోన్ హర్డీ, పేస్ బౌలర్ నాథన్ ఎల్లీస్, యువ స్పిన్నర్ తన్వీర్ ఈ ముగ్గురు ఆటగాళ్లకు ఆసిస్ మేనేజ్మెంట్ ఉద్వాసన పలికింది.
-
Presenting your 15-player men’s provisional squad for the 2023 World Cup!
— Cricket Australia (@CricketAus) September 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The final 15-player squad will be confirmed later this month 🇦🇺 #CWC23 pic.twitter.com/wO0gBbadKi
">Presenting your 15-player men’s provisional squad for the 2023 World Cup!
— Cricket Australia (@CricketAus) September 6, 2023
The final 15-player squad will be confirmed later this month 🇦🇺 #CWC23 pic.twitter.com/wO0gBbadKiPresenting your 15-player men’s provisional squad for the 2023 World Cup!
— Cricket Australia (@CricketAus) September 6, 2023
The final 15-player squad will be confirmed later this month 🇦🇺 #CWC23 pic.twitter.com/wO0gBbadKi
ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆసిస్ జట్టును.. ఈ ఎడిషన్‌లో స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ముందుండి నడిపించనున్నాడు. ఇక ఆరుగురు ఆల్‌రౌండర్లు, నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆసిస్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లీస్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్‌తో టాప్ ఆర్డర్ పటిష్ఠంగా ఉంది.
Australia Tour Of India 2023 : ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఆసిస్.. ఆతిథ్య జట్టుతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. ఇక గురువారం నుంచి ఇరుజట్ల మధ్య 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటన తర్వాత ఆసిస్.. భారత్‌కు రానుంది. ఇక్కడ టీమ్ఇండియాతో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 22న ప్రారంభమౌతుంది. ఇక 2023 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య అక్టోబర్ 8న మ్యాచ్ జరగనుంది. కాగా ఇరుజట్లకు టోర్నమెంట్లో ఇదే తొలిమ్యాచ్. ఈ మ్యాచ్‌కు చెన్నై చిదంబరం స్టేడియం వేదిక కానుంది.
ఆస్ట్రేలియా జట్టు..
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), జోష్ ఇంగ్లీస్ (వికెట్ కీపర్), సీన్ అబాట్, ఆస్టన్ ఏగర్, కెమరాన్ గ్రీన్, జోష్ హజెల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
World Cup 2023 India Squad : ప్రపంచకప్‌నకు భారత్ జట్టు రెడీ!.. రాహుల్ ఇన్.. శాంసన్ ఔట్?
Ashes series 2023 : టాప్-5లోకి స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్