భారత క్రికెట్ హిస్టరీలోనే కాదు.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనూ టాప్ ప్లేయర్స్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒకడు. ఇంకా చెప్పాలంటే ఈ మోడ్రన్ క్రికెట్ వరల్డ్‌లో అతడో అత్యుత్తమ బ్యాటర్.. కొండంత భారీ లక్ష్యాన్నైనా అవలీలలగా చేధించే రన్ మిషన్.. ఫీల్డింగ్‌లో చిరుత.. ఫిట్‌నెస్‌లో టాప్. క్రమశిక్షణ, పట్టుదల, ఫిట్నెస్, దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అతడిని ఈ అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టాయి. ఓ ప్లేయర్‌గా ఎన్నో ప్రపంచ రికార్డులను అధిగమించి సరికొత్త రికార్డులు సృష్టించిన అతడు.. చాలా సందర్భాల్లో ఎప్పుడూ 'ముందు దేశం తర్వాతే నేను' అని అంటుంటాడు. ఇది చాలా మంది క్రికెట్ ప్రియులకు తెలిసిన విషయమే.
అయితే తాజాగా మరోసారి ఇదే విషయాన్ని తెలియజేశాడు విరాట్. దిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతోజరిగిన రెండో టెస్టులో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఓ సందర్భంలో కోహ్లీ స్లిప్‌లో ఫీల్డింగ్ చేశాడు. అప్పుడు స్టేడియంలో ఉన్న కొంతమంది అభిమానులు 'ఆర్సీబీ, ఆర్సీబీ' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టేడియంలో అరిచి అరిచి గోల చేశారు. అయితే ఆ నినాదాలను విన్న విరాట్.. దేశం పట్ల తనకున్న ప్రేమను చూపించాడు. తాను ధిరించిన జెర్సీపై ఉన్న భారత్ లోగోను చూపిస్తూ 'ఇండియా ఇండియా' అంటూ అనాలని సూచించాడు. దీంతో అభిమానులు వెంటనే ఇండియా ఇండియా అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. అయినా కోహ్లీ.. మళ్లీ ఆ సౌండ్ చాలలేదని.. ఇంకా గట్టిగా అనాలని చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ మరింత గట్టిగా ఇండియా ఇండియా అంటూ మైదానం దద్దరిల్లేలా అరిచి రచ్చ రచ్చ చేశారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఫుల్‌గా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు వీడియోకు తెగ లైక్స్ కొడుతూ.. కామెంట్స్ చేస్తున్నారు. 'విరాట్ నువ్వు గ్రేట్', 'కోహ్లీ నువ్వు సూపర్', 'నువ్వు ఎప్పుడూ నెం.1', 'విరాట్ భయ్యా నువ్వు ఎప్పుడూ ఇలానే ఉండాలి' అంటూ కామెంట్లతో సోషల్‌మీడియాను హొరెత్తించారు. ఇకపోతే ఐపీఎల్‌లో కోహ్లీ ఆర్సీబీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో.. తొలి రెండు మ్యాచుల్లో టీమ్ఇండియానే విజయం సాధించింది. ప్రస్తుతం 2-0తేడాతో ఆధిక్యంలో ఉంది. మూడో మ్యాచ్ మార్చి 1నుంచి ప్రారంభం కానుంది.
-
Crowd was chanting 'RCB, RCB' - Virat Kohli told to stop it and chant 'India, India'. pic.twitter.com/kMd53wbYRU
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Crowd was chanting 'RCB, RCB' - Virat Kohli told to stop it and chant 'India, India'. pic.twitter.com/kMd53wbYRU
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2023Crowd was chanting 'RCB, RCB' - Virat Kohli told to stop it and chant 'India, India'. pic.twitter.com/kMd53wbYRU
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2023
ఇదీ చూడండి: ఆసీస్‌కు భారీ షాక్.. మిగతా రెండు మ్యాచ్‌లకు వార్నర్ దూరం..