ETV Bharat / sports

పాక్​ పర్యటనకు టీమ్​ఇండియా.. కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఏం అన్నారంటే?

author img

By

Published : Oct 20, 2022, 8:47 PM IST

టీమ్​ఇండియా.. పాకిస్థాన్​ పర్యటనకు వెళ్లే విషయమై బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడారు. ఏం అన్నారంటే..

Roger Binny
పాక్​ పర్యటనకు టీమ్​ఇండియా రోజర్​ బిన్నీ

వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్​ కోసం భారత జట్టు పాకిస్థాన్​ వెళ్లనుందనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. వీటన్నిటికీ తెరదించుతూ బీసీసీఐ కార్యదర్శి జై షా ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. టీమ్ ఇండియా పాకిస్థాన్​లో పర్యటించబోదని స్పష్టం చేశాడు. ఆసియా కప్​ కూడా పాకిస్థాన్​లో జరగదని.. తటస్త వేదికలో జరుగుతుందని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

దీంతో ప్రతిస్పందించిన పీసీబీ.. బీసీసీఐపై మండిపడింది. పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. తటస్థ వేదికగా ఆడతామంటే.. తాము భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ 2023 టోర్నీతో సహా ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నుంచి వైదొలుగుతామని వార్నింగ్ ఇచ్చింది. అయితే తాజాగా దీనిపై బోర్డు నూతన అధ్యక్షుడు రోజర్​ బిన్నీ స్పందించారు.

"పాక్​ పర్యటనపై నిర్ణయం బీసీసీఐ పరిధిలోనిది కాదు. ప్రభత్వం క్లియరెన్స్​ ఇస్తేనే మేము అక్కడికి వెళ్తాం. ఇతర జట్లు ఇక్కడ పర్యటించాలన్న ప్రభుత్వం క్లియరెన్స్​ లెటర్ ఇవ్వాల్సిందే. మేం సొంత నిర్ణయం తీసుకోలేం. గవర్నమెంట్​ ఏం తీసుకుంటే అదే అనుసరిస్తాం. అయితే పాక్ పర్యటనపై మేము కేంద్రాన్ని ఇంకా సంప్రదించలేదు" అని బిన్నీ అన్నారు.

అంతకుముందు కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ మాట్లాడుతూ.. "వన్డే ప్రపంచకప్‌ను నిర్వహించే బాధ్యత బీసీసీఐదే. అందుకే ఇది బీసీసీఐ విషయం. ఆ బోర్డే స్పందించాలి. భారత్ క్రీడలకు పవర్‌హౌస్‌లాంటిది. చాలా ప్రపంచకప్‌లను ఇక్కడ నిర్వహించాం. అలాగే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. అందులో పాక్‌తో సహా పెద్ద జట్లన్నీ తప్పకుండా పాల్గొంటాయి. భారత్‌ నుంచి క్రీడలను వేరు చేయలేం. క్రికెట్‌తో సహా చాలా క్రీడల్లో భారత్‌ పాల్గొంటుంది. పాకిస్థాన్‌లో భద్రతాపరమైన అంశాలను కేంద్ర హోం శాఖ చూసుకొంటుంది. క్రికెట్‌కు సంబంధించినదే కాకుండా ఆటగాళ్ల భద్రత కూడా చాలా కీలకం. ఎవరి మాటను వినే అవసరం భారత్‌కు లేదు. మమ్మల్ని ఎవరూ డిక్టేట్‌ చేయలేరు" అని అనురాగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆసీస్‌ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ అక్టోబర్‌ 23న తలపడనుంది.

ఇదీ చూడండి: 'కుట్రపూరితంగానే గంగూలీని తప్పించారు'.. దాదాకు మద్దతుగా దీదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.