టీమ్ఇండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ(Stuart Binny) సోమవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 2014-16 మధ్య అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఇతడు.. ఈ ఫార్మాట్‌తో పాటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
1983 ప్రపంచకప్(1983 వరల్డ్‌కప్) గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ కుమారుడు స్టువర్ట్ బిన్నీ. తండ్రిలానే క్రికెటర్‌గా మారిన ఇతడు.. భారత్ తరఫున 14 వన్డేలు, 6 టెస్టులు, 3 టీ20లు ఆడాడు. దాదాపు 17 ఏళ్లపాటు దేశవాళీకు కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించాడు.
2014లో తొలిసారి బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికైన ఇతడు.. రెండో వన్డేలు 4 పరుగులిచ్చి, 6 వికెట్లు తీశాడు. తద్వారా వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత ఆటగాడిగా ఘనత సాధించాడు.
2010లో ఐపీఎల్లో(IPL) అడుగుపెట్టిన స్టువర్ట్ బిన్నీ.. ఆ ఏడాది ముంబయి ఇండియన్స్‌కు(Mumbai Indians) ఆడాడు. ఆ తర్వాత 6 సీజన్లపాటు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం రెండేళ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో(RCB) ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ రాజస్థాన్‌లోకి వచ్చాడు.
గతేడాది ఐపీఎల్ వేలంలో ఇతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. గత సీజన్ రంజీలో కర్ణాటక నుంచి నాగాలాండ్‌కు మారిన బిన్నీ.. ఇప్పుడు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇతడి భార్య మయాంతి లాంగర్(Myanthi Langer) స్పోర్ట్స్ వ్యాఖ్యాత. ఐపీఎల్‌తో పాటు పలు అంతర్జాతీయ సిరీస్‌ల సందర్భంగా తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉంటుంది. ఈమెకు అభిమానులు కూడా బాగానే ఉన్నారు!
ఇవీ చదవండి: