Shreyas Iyer: క్రికెట్లో అత్యంత వేగంగా ఎదుగుతోన్న టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఎంపికయ్యాడు. స్వదేశంలో గత నెల వెస్టిండీస్‌పై, ప్రస్తుతం శ్రీలంకపై అదిరిపోయే ప్రదర్శనతో ఈ ఘనత దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమెలియా కెర్‌ను ఈ అవార్డు వరించింది.
వెస్టిండీస్‌తో మూడో వన్డేలో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన (80 పరుగులు) సహా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో 16 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు అయ్యర్. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌లో మూడు మ్యూచ్ల్లోనూ 57, 74, 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.
లంకతో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ అదరగొడుతున్నారు అయ్యర్. రెండో టెస్టులో (92, 67) రెండు అర్ధశతకాలతో రాణించాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి టీమ్ఇండియా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ఇదీ చూడండి: కోహ్లీ చేసిన పనికి నవ్వులే నవ్వులు.. ఏకంగా మ్యాచ్ మధ్యలో..