Ruturaj Gaikwad Asian Games : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్.. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో వైస్‌కెప్టెన్ హోదాలో అదరగొట్టాడు. ఐపీఎల్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ స్టార్ ప్లేయర్.. రానున్న ఆసియా క్రీడల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ క్రమంలో అతడు తాజాగా కెప్టెన్సీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ గైక్వాడ్ ఏమన్నాడంటే..
Ruturaj Gaikwad On Dhoni : ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు ఎం.ఎస్ ధోనీ.. తనకు సలహాలు ఇచ్చేవాడని రుతురాజ్ అన్నాడు. ఎప్పుడూ ఆటపై శ్రద్ధ పెట్టాలని ధోనీ సూచించేవాడంటూ తెలిపాడు. భవిష్యత్తు గురించి అస్సలు చింతించే అవసరం లేదని.. మన పని చేసుకుంటూ పోవాలని ధోనీ అనేవాడని తెలిపాడు. ఇక కెప్టెన్ అనేవాడు.. జట్టులోని ప్లేయర్లందరికీ ఆత్మవిశ్వాసాన్ని అందించాలని.. వారు ఏమనుకుంటున్నారో, వారి అభిప్రాయాలేంటో తప్పకుండా తెలియాలని, వారిపై నాయకుడు విశ్వాసం ఉంచాలంటూ రుతురాజ్ అభిప్రాయపడ్డాడు.
మరోవైపు రుతురాజ్ ఇప్పటికే డొమెస్టిక్ క్రికెట్లో పలు లీగ్‌ల్లో ఆయా జట్లకు నాయకత్వం వహిస్తున్నాడు. మహారాష్ట్ర స్థానిక టీ20 లీగ్‌లో పుణె జట్టుకు రుతురాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇంత చిన్న వయసులో (26) ఆసియా క్రీడల్లో టీమ్ఇండియాకు నాయకత్వం వహించే అవకాశం రుతురాజ్‌కు దక్కింది. దీంతో ఐపీఎల్లో సైతం అతడికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పగ్గాలు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Ruturaj Gaikwad IPL Career : రుతురాజ్ గైక్వాడ్ 2020లో తొలి ఐపీఎల్ ఆడాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగిన గైక్వాడ్.. ఆ సీజన్లో మరో 5 మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించాడు. అప్పటినుంచి చెన్నై జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. గత మూడు సీజన్ల నుంచి చెన్నైలో ఓపెనింగ్ బ్యాటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటిదాకా 52 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్.. 135 స్ట్రైక్ రేట్‌తో 1797 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 14 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 2021లో శ్రీలంకపై టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. గతేడాది సౌతాఫ్రికా మ్యాచ్‌తో వన్డేల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు.
పెళ్లి తర్వాత ఫస్ట్ మ్యాచ్.. 22 బంతుల్లోనే రుతురాజ్ హాఫ్ సెంచరీ.. 5 సిక్సులతో బీభత్సం!
యశస్వీ, తిలక్, గైక్వాడ్.. ఫ్యూచర్ టీమ్ఇండియా రెడీ! లిస్ట్‌లో ఇంకా ఎవరంటే?