ETV Bharat / sports

'కోహ్లీకి ఏదీ అసాధ్యం కాదు.. గాడిలో పడితే చెలరేగడమే' - సిచిన్​ సెంచరీల రికార్డ్​

Ricky Ponting On Virat Kohli : విరాట్​ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. కోహ్లీకి సాధ్యం కానిది ఏదీ లేదని చెప్పాడు. సచిన్​ తెందుల్కర్​ను సైతం అధిగమిస్తాడని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే..

ricky ponting
nothing is impossible to virat kohli says ricky ponting
author img

By

Published : Sep 20, 2022, 7:20 AM IST

Ricky Ponting On Virat Kohli : విరాట్‌ కోహ్లికి ఏదీ అసాధ్యం కాదు అని అనుకోవట్లేదని.. అతడు సచిన్‌ తెందుల్కర్‌ అత్యధిక అంతర్జాతీయ సెంచరీల రికార్డు కూడా అధిగమించే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. "విరాట్‌ కోహ్లికి ఏదీ అసాధ్యమని చెప్పలేను. ఒకసారి అతడు గాడిలో పడితే పరుగుల ఆకలితో ఎంతగా చెలరేగుతాడో చెప్పక్కర్లేదు. కోహ్లి ఇంకా చాలా రోజులు ఆడతాడు. ఇప్పటికీ సచిన్‌ తెందూల్కర్‌ రికార్డును అధిగమించడానికి అతడు 30 సెంచరీలు వెనుకే ఉన్నాడు. విరాట్‌ ఫామ్‌ కొనసాగిస్తే తెందుల్కర్‌ను అందుకునే అవకాశాలున్నాయి" అని పాంటింగ్‌ అన్నాడు.

కేఎల్‌ రాహుల్‌ స్థానంలో విరాట్‌ కోహ్లి ఓపెనింగ్‌కు దించాలన్న డిమాండ్‌లో అర్థం లేదని.. ఇది పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తుందని రికీ పేర్కొన్నాడు. "విరాట్‌ను ఓపెనర్‌గా పంపాలి అని పదే పదే అడుగుతున్నారు. ఇది మరింత ఇబ్బందులను సృష్టిస్తుంది. ప్రపంచకప్‌ ముంగిట పరిస్థితిని సంక్లిష్టం చేస్తుంది. టీ20ల్లో సెంచరీ చేస్తానని తాను అనుకోలేదని కోహ్లినే చెప్పాడు. చాలామంది ఈ సెంచరీ చూసి అతడే ఓపెనర్‌గా దిగాలి అంటున్నారు" అని పాంటింగ్‌ అన్నాడు. ఆసియాకప్‌లో అఫ్గానిస్థాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో కోహ్లి 61 బంతుల్లో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న రికీ పాంటింగ్‌ (71) సరసన నిలిచాడు.

ఇవీ చదవండి: కోహ్లీతో అంత ఈజీ కాదు: ఆసీస్ కెప్టెన్​

Legends League: క్రికెటర్​కు తప్పిన ప్రమాదం.. హోటల్​ గదిలో పాము కలకలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.