ETV Bharat / sports

వరల్డ్​ కప్​ 2023 - 'హార్దిక్​ ప్లేస్​లో ప్రసిద్ధ్​ను అందుకే తీసుకున్నాం' - వరల్డ్​ కప్​ 2023 రాహుల్​ ద్రవిడ్​

Rahul Dravid World Cup 2023 : వరుస విజయాలతో వరల్డ్​కప్​లో దుసుకెళ్తున్న టీమ్ఇండియా స్క్వాడ్​లో తాజాగా మార్పులు జరిగాయి. జట్టులోని కీలక ప్లేయర్ హార్దిక్​ పాండ్య దూరం కావడం వల్ల అతని స్థానంలో ప్రసిద్ధ్​ కృష్ణను ఎంచుకున్నారు. తాజాగా ఈ విషయంపై హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ క్లారిటీ ఇచ్చాడు.

Rahul Dravid  World Cup 2023
Rahul Dravid World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 12:28 PM IST

Rahul Dravid World Cup 2023 : వన్డే ప్రపంచకప్​లో టీమ్ఇండియా ప్లేయర్లు దూసుకెళ్తున్నారు. ఆడిన 7 మ్యాచుల్లోనూ అత్యధిక స్కోర్​ సాధించి ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. టాప్ ఆర్డర్​, మిడిల్ ఆర్డర్​, బౌలింగ్​ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంటూ సెమీస్​లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో నేడు (నవంబర్ 5)న దక్షిణాఫ్రికాతో రోహిత్​ సేన తలపడనుంది. అయితే.. గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఈ ప్రపంచకప్‌ టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అతడి స్థానంలో యంగ్​ ప్లేయర్​ ప్రసిద్ధ్‌ కృష్టను జట్టులోకి తీసుకున్నట్లు తాజాగా బీసీసీఐ వెల్లడించింది. ఇక ఈ విషయంపై హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ క్లారిటీ ఇచ్చాడు. అతడి ఎంపికకు గల కారణాలను మీడియాకు వివరించాడు. టీమ్‌ఇండియా పేస్‌ బౌలింగ్​ స్క్వాడ్​ను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

"ఇది మంచి ఆలోచన. మేం ముగ్గురు ఫాస్టబౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్లో ఆడాం. 15 మందితో కూడిన జట్టులో మాకు స్పిన్‌ బ్యాకప్‌(అశ్విన్‌) కూడా ఉంది. అలాగే ఆల్‌రౌండర్‌(శార్దూల్‌ ఠాకూర్‌) బ్యాకప్‌ కూడా మాకు ఉంది. అయితే.. ఫాస్ట్‌ బౌలింగ్‌ మాత్రం బ్యాకప్‌ లేదు. దీంతో ఎవరైనా అనారోగ్యం బారిన పడ్డా, గాయపడ్డా.. అందుకోసం బ్యాకప్‌ అవసరమని మేం గుర్తించాం. ఇది ఇతర కాంబినేషన్లతో ఆడేందుకు మాకు ఉపయోగపడుతుందని నా భావన" అని ద్రవిడ్‌ వివరించాడు.

ఇక ప్రసిద్ధ్‌ కృష్ణ ఇప్పటి వరకు 17 వన్డేలు ఆడి అందులో 29 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ ఆడాడు. అయితే ఇప్పుడున్న టీమ్‌ఇండియా పేస్‌ త్రయంలో బుమ్రా, షమి, సిరాజ్‌ అదరగొడుతున్నారు. ఈ క్రమంలో వీరిలో ఎవరికైనా గాయమైతే తప్ప ప్రసిద్ధ్‌కి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.

అక్టోబర్‌ 19న పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తుండగా గాయపడిన హార్దిక్‌.. ఆ తర్వాత మళ్లీ టీమ్​లోకి రాలేదు. సెమీఫైనల్‌ నాటికి అతడు అందుబాటులోకి వస్తాడని అనుకున్నప్పటికీ.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

Rahul Dravid World Cup 2023 : 'మేం చేయగలిగింది అంతవరకే.. కోచ్​లు గ్రౌండ్​లోకి దిగలేరు కదా!'

Rahul Dravid Son Cricket : అండర్‌-19 జట్టుకు ఎంపికైన ద్రవిడ్‌ తనయుడు.. ఏ టోర్నీలో ఆడనున్నాడంటే ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.