ETV Bharat / sports

ODI World Cup 2023 Ind Vs Pak : ఐదుగురు తలో రెండు వికెట్లు.. పాక్​పై భారత బౌలర్ల మ్యాజిక్​ వీడియోలు చూశారా? - teamindia bowler pakisthan match video

ODI World Cup 2023 Ind Vs Pak : వన్డే వరల్డ్ కప్​ 2023లో భాగంగా టీమ్​ ఇండియాతో జరుగుతున్న హై ఓల్టేజ్​ మ్యాచ్​లో టీమ్​ఇండియా బౌలర్లు అదరగొట్టారు. వారి అద్భుత ప్రదర్శన వీడియోలు మీకోసం..

ODI World Cup 2023 Ind Vs Pak : ఐదుగురు తలో రెండు వికెట్లు.. పాక్​పై భారత బౌలర్ల మ్యాజిక్​ వీడియోలు చూశారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 7:09 PM IST

ODI World Cup 2023 IND VS PAK : వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా పాకిస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్​ఇండియా పేసర్లు అద్భుతంగా రాణించారు. పాక్​ జట్టును 191 పరుగులకు కట్టడి చేశారు. వికెట్ల మోత మోగించారు.

సిరాజ్‌ తొలి వికెట్‌.. మహ్మద్‌ సిరాజ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. ఎనిమిదో ఓవర్లో పాక్‌ ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్​ను(20) ఎల్బీడబ్ల్యూగా పంపి భారత్‌కు తొలి వికెట్‌ అందించాడు. ఇక 12.3వ ఓవర్లో పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.. మరో ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్​ను(36) పెవిలియన్‌కు పంపాడు. అయితే 24.3వ ఓవర్లో కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్​ను అంపైర్‌ కాల్‌తో లైఫ్‌ లభించగా.. హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. ఆర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత మూడో బంతికే సిరాజ్‌.. బాబర్‌ను అద్భుతమైన డెలివరీతో బౌల్డ్‌ చేసి టీమ్​ఇండియాకు మూడో వికెట్‌ అందించాడు. అనంతరం స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 32వ ఓవర్లో.. రెండో బంతికి సౌద్‌ షకీల్​ను(6) ఎల్బీడబ్ల్యూ చేసి.. అదే ఓవర్​ ఆఖరి బంతికి ఇఫ్తికర్‌ అహ్మద్​ను(4) క్లీన్​ బౌల్డ్‌ చేశాడు.

వరుస ఓవర్లలో ఆ ఇద్దరినీ .. 34 ఓవరల్లో పాక్‌ స్టార్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 49వ పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. బుమ్రా అద్భుతంగా అతడిని బౌల్డ్‌ చేసి ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే షాదాబ్‌ ఖాన్‌ను కూడా బౌల్డ్‌ చేశాడు. అనంతరం హార్దిక్‌ పాండ్య.. మహ్మద్‌ నవాజ్​ను(4), రవీంద్ర జడేజా .. హసన్‌ అలీ(12), హ్యారిస్‌ రవూఫ్‌ను పెవిలియన్‌కు పంపి.. పాకిస్థాన్​ కథను 42.5 ఓవర్లకే ముగించేశారు.

ఐదుగురూ సరిసమానంగా.. మొత్తంగా టీమ్​ఇండియా బౌలర్లలో పేసర్లు సిరాజ్‌, బుమ్రా, పాండ్య.. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్‌ తలో రెండు వికెట్లు తీసి పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని సరిసమానంగా పంచుకున్నారు. 2 ఓవర్లు బౌలింగ్‌ చేసిన పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ మాత్రం ఏం తీయలేకపోయాడు.

హార్దిక్ సెలబ్రేషన్స్​.. టీమ్ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. మ్యాచ్ ప్రారంభంలో క్రీజులో పాతుకుపోతన్న పాకిస్థాన్​ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌-హక్‌ను.. తన మూడో ఓవర్‌లో మాత్రం అద్భుతంగా ఔట్ చేశాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌లో మూడో బాల్​ను వైడ్‌ ఆఫ్‌స్టంప్‌ దిశగా సంధించగా.. ఇమామ్‌ కవర్‌ డ్రైవ్‌ షాట్‌ ఆడటానికి ట్రై చేశాడు. బాల్​ ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ రాహుల్‌ చేతికి చిక్కింది. దీంతో స్టేడియం దద్దరిల్లింది. హార్దిక్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్న వీడియో వైరల్ అయింది.

సిరాజ్‌ సూపర్‌ డెలివరీ.. పాకిస్థాన్​ కెప్టెన్‌ బాబర్‌ అజామ్​ను.. టీమ్​ఇండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించడం కూడా బాగా వైరల్ అయింది. పాక్‌ ఇన్నింగ్స్‌ 30 ఓవర్‌లో సిరాజ్‌ నాలుగో బంతిని గుడ్‌లెంగ్త్‌ దిశగా వేశాడు. ఆ బంతిని పాక్ కెప్టెన్​.. థర్డ్‌మ్యాన్‌ దిశగా ఆడటానికి ట్రై చేశాడు. అయితే బాల్​.. బాబర్‌ బ్యాట్‌కు మిస్సై ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో బాబర్‌ ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు.

ODI World Cup 2023 Ind Vs Pak : టీమ్​ఇండియా బౌలర్ల మ్యాజిక్​.. పాక్ బ్యాటర్ల ఫ్యూజులు ఔట్​.. లక్ష్యం ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.