ETV Bharat / sports

2వేల కడక్​నాథ్ కోడిపిల్లల్ని కొన్న ధోనీ.. అన్ని ఎందుకంటే? - కడక్​నాథ్ చికెన్ ధర

MS Dhoni Kadaknath chicks: నల్లగా నిగనిగలాడే కడక్​నాథ్ కోళ్లు.. ధోనీ ఫాంహౌజ్​కు చేరాయి. ధోనీ కోసం రెండు వేల కోడి పిల్లల్ని రాంచీకి తరలించారు మధ్యప్రదేశ్ అధికారులు. అసలు ఈ కోళ్లేంటి? వీటితో మహీ ఏం చేయనున్నాడు?

MS Dhoni Kadaknath chicks
MS Dhoni Kadaknath chicks
author img

By

Published : Apr 24, 2022, 8:24 PM IST

MS Dhoni Kadaknath chicks: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ.. ప్రోటీన్లు మెండుగా ఉండే కడక్‌నాథ్ కోడి పిల్లల కోసం ఆర్డర్ చేశాడు. రెండు వేల కోడిపిల్లల కోసం మధ్యప్రదేశ్‌ ఝాబువాలోని ఓ సహకార సమాఖ్యకు ధోనీ ఆర్డర్‌ చేసినట్లు స్థానిక కలెక్టర్ తెలిపారు. ఓ వాహనంలో రెండు వేల కోడిపిల్లలను రాంచీలోని ధోనీ ఫాంకు తరలించినట్లు తెలిపారు.

MS Dhoni Kadaknath farmhouse: నిజానికి ధోనీ తన ఫాంహౌజ్​లో కడక్​నాథ్ కోళ్లను పెంచుతున్నాడు. ఎప్పుడో కరోనాకు ముందు వీటిని ఆర్డర్ చేశాడు. అయితే, మహమ్మారి ప్రభావం ఉండటం, అదేసమయంలో బర్డ్ ఫ్లూ సోకి అనేక కోళ్లు చనిపోవడం వల్ల.. వీటి డెలివరీ ఆలస్యమైంది. ధోనీలాంటి ప్రముఖ వ్యక్తి కడక్‌నాథ్ కోళ్లపై ఆసక్తి చూపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఝాబువా కలెక్టర్. ఎవరైనా ఆన్‌లైన్ వేదికగా ఈ కోళ్లను ఆర్డర్‌ చేయవచ్చని తెలిపారు.

మధ్యప్రదేశ్​లోని ఝాబువా జిల్లాలో ఈ కడక్​నాథ్ కోళ్లు విరివిగా లభిస్తాయి. ఈ కోళ్ల పెంపకం ద్వారా ప్రత్యేకత సాధించిన ఈ జిల్లాకు.. 2018లోనే జీఐ ట్యాగ్​ కూడా లభించింది. అధిక పోషక విలువలు ఉన్న కారణంగా కడక్‌నాథ్ కోళ్ల మాంసం, కోడిగుడ్ల రేటు అధికంగా ఉంటుంది. ఈ కోళ్లు తల నుంచి కాలి గోటి వరకు నలుపు రంగులో నిగనిగలాడుతుంటాయి.

ఇదీ చదవండి:

అరటిపండ్లు తింటూ సచిన్​కు బర్త్​డే విషెస్.. సెహ్వాగ్ స్టైలే వేరయా!

సగం టోర్నీ పూర్తి... అగ్రజట్లు డీలా.. వీరిదే అద్భుత ప్రదర్శన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.