Kohli 300 Victories : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటేనే ఓ పరుగుల ప్రవాహం. ఏ దేశంలో ఆడినా.. పిచ్ ఎలాంటిదైనా.. అవతలున్నది ఎలాంటి బౌలరైనా.. క్రీజులో అడుగు పెడితే పరుగుల వరద పారాల్సిందే. అయితే ఆ మధ్యలో కొంతకాలం ఫామ్‌లో లేక ఇబ్బంది పడిన అతడు.. ప్రస్తుతం తన 2.0లో విశ్వరూపం చూపిస్తున్నాడు. పరుగుల వరద పారిస్తూ.. సెంచరీల మోత మోగిస్తున్నాడు.
ఇటీవలే కెరీర్లో 77వ అంతర్జాతీయ సంచరీ అందుకున్న అతడు.. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచ క్రికెట్‌లో మరో అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 300 విజయాల్లో భాగమైన ఆరో క్రికెటర్‌గా రికార్డుకు ఎక్కాడు. ఆసియా కప్ 2023లో భాగంగా సెప్టెంబర్ 12 జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంకపై టీమ్ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంతోనే విరాట్.. ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు.
ప్రపంచ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ కన్నా ముందు కేవలం ఐదుగురు క్రికెటర్లు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యధికంగా 377 విజయాల్లో భాగస్వామ్యమయ్యాడు. ఆ తర్వాత శ్రీలంక లెజెండరీ ప్లేయర్ మహేళ జయవర్ధనే 336, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ 307, దక్షిణాఫ్రికా ఆల్‌టైమ్ గ్రేట్ జాక్ కల్లిస్ 305, లంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర 305 వరుసగా ఉన్నారు.
Asia Cup 2023 Kohli Score : ప్రస్తుతం ఈ ఆసియా కప్‌లో కోహ్లీ ప్రదర్శన బాగానే ఉంది. ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడిన అతడు .. తన మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 4 పరుగులు చేసి నిరాశపరచగా.. తర్వాతి మ్యాచ్‌లో అదే పాకిస్థాన్‌పై 122 సెంచరీతో పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ అనంతరం లంకతో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు.
-
For his outstanding unbeaten TON, Virat Kohli bagged the Player of the Match award as #TeamIndia beat Pakistan by 228 runs in Super 4s 👏 👏
— BCCI (@BCCI) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard ▶️ https://t.co/kg7Sh2t5pM#AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/Zq0WVZK3XG
">For his outstanding unbeaten TON, Virat Kohli bagged the Player of the Match award as #TeamIndia beat Pakistan by 228 runs in Super 4s 👏 👏
— BCCI (@BCCI) September 11, 2023
Scorecard ▶️ https://t.co/kg7Sh2t5pM#AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/Zq0WVZK3XGFor his outstanding unbeaten TON, Virat Kohli bagged the Player of the Match award as #TeamIndia beat Pakistan by 228 runs in Super 4s 👏 👏
— BCCI (@BCCI) September 11, 2023
Scorecard ▶️ https://t.co/kg7Sh2t5pM#AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/Zq0WVZK3XG
Asia Cup 2023 Virat Kohli Centuries : నిన్న సూపర్ సెంచరీ.. ఈ రోజేమో బోల్తా.. 71- 77 దాకా ఇదే తీరు!
Kohli Centuries : మోస్ట్ డేంజరెస్‌గా కోహ్లీ 2.0.. ఈ ఏడాది ఏకంగా ఎన్ని సెంచరీలు, పరుగులు చేశాడంటే?