ETV Bharat / sports

భారత్​కు షాక్​! ఇంగ్లాండ్​ పర్యటనకు స్టార్ ఓపెనర్ దూరం.. చికిత్స కోసం జర్మనీకి - కేఎల్​ రాహుల్​

కీలకమైన ఇంగ్లాండ్​ పర్యటనకు ముందు టీమ్​ఇండియాకు గట్టి షాక్​ తగిలింది! స్టార్​ ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ ఇంగ్లాండ్ పర్యటనకు కూడా దూరం కానున్నాడు. గాయం కారణంగా ఇప్పటికే సఫారీలతో సిరీస్​కు దూరమైన అతడు​.. చికిత్స కోసం జర్మనీ వెళ్లనున్నాడు.

రాహుల్
రాహుల్
author img

By

Published : Jun 16, 2022, 4:16 PM IST

గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్​కు దూరమైన టీమ్​ఇండియా వైస్​కెప్టెన్ కేఎల్​ రాహుల్​.. ఇప్పుడు ఇంగ్లాండ్​ పర్యటనకు కూడా దూరం కానున్నాడు. గాయం తీవ్రంగా ఉండటం వల్ల చికిత్స కోసం జర్మనీ వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా గురువారం ప్రకటించారు. ఈ నెలాఖరున లేదా జూలై మొదటివారంలో రాహుల్​ జర్మనీకి వెళ్తాడని చెప్పారు.

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమ్​ఇండియా గతేడాది వాయిదా పడ్డ టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. రోహిత్​ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక.. రాహుల్​ను వైస్​కెప్టెన్​గా నియమించింది బీసీసీఐ. అయితే ఇప్పుడు గాయం కారణంగా రాహుల్​ దూరం కావడం వల్ల ఆ స్థానంలో బోర్డు మరొకరిని భర్తి చేయనుంది. అయితే ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: కోహ్లీ.. ఆడాలని ఉందా లేదా?.. షాహిద్​ అసహనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.