ETV Bharat / sports

ICC World Cup 2023 : ఇప్పుడు చర్చంతా కేన్ 'మామ' గురించే.. వస్తాడో?.. లేదో? - కేన్​ విలియమ్సన్​ లేటెస్ట్​ న్యూస్

Kane Williamson ICC World Cup 2023 : భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే వరల్డ్​ కప్​నకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా జట్టుపై చర్చ నడుస్తోంది. అయితే కేన్‌ విలియమ్సన్‌ గురించి కూడా అదే స్థాయిలో మాట్లాడుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. ఎందుకంటే?

Kane Williamson Icc World Cup 2023
Kane Williamson Icc World Cup 2023
author img

By

Published : Aug 11, 2023, 10:21 PM IST

Kane Williamson Icc World Cup 2023 : ఈసారి ఐసీసీ వన్డే వరల్డ్​ కప్​నకు భారత్​ ఆతిథ్యమిస్తోంది. అక్టోబర్​లో ఈ మెగాటోర్నీ ప్రారంభమవుతుంది. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్​ సమరానికి దగ్గరపడుతోంది. ఈ క్రమంలో టోర్నీకి భారత జట్టు ఎలా ఉండబోతోందనే విషయమై ఓవైపు ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదే సమయంలో టీమ్​ఇండియా అభిమానుల దృష్టి ఓ విదేశీ ఆటగాడి మీద పడింది. అతడు ఈ వరల్డ్​కప్​లో ఆడతాడా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఆ ప్లేయర్​ మరెవరో కాదు టీమ్ఇండియా అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాందించుకున్న.. ముఖ్యంగా హైదరాబాదీలకు సుపరిచితుడు కేన్​ మామ.. అదే న్యూజిలాండ్​ ఆటగాడు కేన్​ విలియమ్సన్​.

అయితే, కొందరు ప్రేయర్లు.. తమ ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ ఆకట్టుకుని.. దేశాల అంతరాలను చెరిపివేస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటాు. అలాంటి కోవకు చెందిన ఆటగాడే న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌. మామూలుగానే న్యూజిలాండ్‌ క్రికెటర్లను అందరూ ఇష్టపడతారు. జెంటిల్‌మన్‌ గేమ్‌గా పిలిచే క్రికెట్‌ను జెంటిల్‌మెన్‌లాగే ఆడతారు ఆ దేశ ప్లేయర్లు. ప్రత్యర్థి ఆటగాళ్లను పల్లెత్తు మాట అనుకుండా.. ఆటలో తొండికి తావు లేకుండా.. వివాదాల జోలికి వెళ్లకుండా.. పద్ధతిగా ఆడటం న్యూజిలాండ్‌ ఆటగాళ్ల శైలి. అందులోనూ కేన్‌ విలియమ్సన్‌ అంటే మర్యాదరామన్న తరహానే. ప్రత్యర్థి ప్లేయర్లతో కలుపుగోలుగా ఉంటాడు. అందరినీ గౌరవిస్తాడు.

ఇక కేన్​ విలియమ్సన్ ఆట విషయానికి వస్తే.. గత దశాబ్ద కాలంగా ఫార్మాట్లతో సంబంధం లేకుండా ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్, జో రూట్‌ల సరసన నిలుస్తూ మోడర్న్‌ గ్రేట్స్‌లో ఒకడిగా కితాబులందుకుంటున్నాడు. న్యూజిలాండ్‌ దేశస్థులే కాదు.. వరల్డ్​వైడ్​గా అనేక దేశాల్లో కేన్​కు అభిమానులు ఉన్నారు. ఇక ఇండియాలో అతడికి వీరాభిమానులే ఉన్నారని చెప్పొచ్చు. ఇండియన్ ప్రీమియర్​ లీగ్- ఐపీఎల్‌ ఆడుతూ ఇక్కడ భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. అందరూ మెచ్చే ఇలాంటి మేటి ఆటగాడు.. వరల్డ్​ కప్​ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడాలని ప్రతి క్రికెట్‌ అభిమానీ కోరుకుంటాడనడం అతిశయోక్తి కాదు. అయితే అనుకోని గాయం అతడు ఇండియా రావడంపై సందేహం నెలకొనేలా చేసింది.

ఐపీఎల్‌లో ఆ చేదు జ్ఞాపకం..
Kane Williamson Injury Update World Cup : గత ఐపీఎల్​ సీజన్‌ వరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కేన్​ ఆడాడు. ఆ తర్వాత సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు మారాడు. ఆ జట్టు తరఫున తొలి మ్యాచ్‌లోనే అతను అనూహ్యంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్‌ చేస్తూ కాలు మడతపడటం వల్ల గ్రౌండ్ బయటికి నడిచి కూడా వెళ్లలేని పరిస్థితిలో.. ఇద్దరు సహాయకులు అతడిని తమ భుజాలపై మోసుకెళ్లారు. గాయం తీవ్రత దృష్ట్యా వెంటనే కేన్​ న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. తర్వాత సర్జరీ చేయించుకున్నాడు. ఆ శస్త్ర చికిత్స జరిగి అయిదు నెలలు దాటింది. ఇంకా కేన్‌ పూర్తిగా కోలుకోలేదు. అతడి లేకుండానే న్యూజిలాండ్‌ జట్టు.. టామ్‌ లేథమ్‌ కెప్టెన్సీలో ఆడుతోంది. న్యూజిలాండ్‌ బలమైన జట్టే అయినా.. విలియమ్సన్​ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

Kane Williamson Age : ఒక దశలో విలియమ్సన్ వరల్డ్​కప్‌నకు అందుబాటులో ఉండే అవకాశమే లేదని వార్తలు వచ్చాయి. కానీ అతడు అనుకున్నదానికంటే వేగంగానే కోలుకుంటున్నాడు. ప్రస్తుతం మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. తమ సారథి ప్రపంచకప్‌లో ఆడతాడనే ఆశాభావంతోనే న్యూజిలాండ్​ జట్టు ఉంది. అయితే కేన్‌ విలియమ్సన్ మొదటి నుంచి ఆడకున్నా.. మెగా టోర్నీ మధ్యలో వచ్చినా తమకు సంతోషమే అని న్యూజిలాండ్ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ అంటున్నాడు. అయితే కేన్‌ స్థాయి ఆటగాడు లేకుంటే ఇలాంటి మెగా టోర్నీకి అదొక లోటుగా నిలుస్తుందని.. కివీస్​ జట్టు ఆకర్షణ కోల్పోతుందని అనడంలో సందేహం లేదు. విలియమ్సన్‌ వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. మరో ప్రపంచకప్‌నకు అతను అందుబాటులో ఉండటం కష్టం. కాబట్టి ఇప్పుడు మిస్‌ అయితే మళ్లీ అతడిని వరల్డ్​ కప్​లో చూడటమూ సందేహమే.

హైదరాబాదీలతో కేన్​ అనుబంధం...
Kane Williamson Ipl Team : కేన్‌ విలియమ్సన్‌ అంటే తెలుగువారికి.. ముఖ్యంగా హైదరాబాదీలకు ప్రత్యేక అభిమానం ఉంది. ఐపీఎల్ సన్​రైజర్స్​ ఐపీఎల్‌ అతను చాలా ఏళ్లు ప్రాతినిధ్యం వహించాడు. కొన్నేళ్లు జట్టుకు సారథిగానూ ఉన్నాడు. ఈ సమయంలోనే అతడిని తెలుగు అభిమానులు ప్రేమగా 'కేన్‌ మామ' అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. సోషల్​ మీడియాలో ఈ పేరు బాగా పాపులర్‌. సన్‌రైజర్స్‌కు ఆదరణ పెంచడంలో వార్నర్‌తో పాటు కేన్‌ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. విలియమ్సన్‌ న్యూజిలాండ్‌ తరఫున హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఆడినా.. అతడి మీద ఇక్కడి అభిమానులు ప్రత్యేక ప్రేమ చూపిస్తుంటారు. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ జట్టు హైదరాబాద్‌ వేదికగా నెదర్లాండ్స్‌తో ఒక మ్యాచ్‌ ఆడబోతోంది. అంతకంటే ముందు పాకిస్థాన్‌తో కివీస్‌ వార్మప్‌ మ్యాచ్‌కు కూడా హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దీంతో కేన్‌ కోలుకుని ఈ మ్యాచ్‌లు ఆడతాడని ఇక్కడి అభిమానులు ఆశిస్తున్నారు. కేన్‌ అందుబాటులోకి వస్తే.. అతడి ఆట చూసేందుకే పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియాలకు వస్తారనడంలో సందేహం లేదు.

అయ్యో కేన్​ మామ.. క్రచెస్​ సాయంతో స్వదేశానికి.. బాధపడుతున్న ఫ్యాన్స్​!

ఆటకు దూరంగా 110 రోజులు.. అయినా నెం.1గా కేన్​ మామ.. టాప్-10లో భారత్​ నుంచి ఒక్కడే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.