ETV Bharat / sports

భారత క్రికెటర్​పై ఆరోపణలు! పిచ్ రోలర్ దొంగిలించాడంటూ.. - పర్వేజ్​ రసూల్​పై జేకేసీఏ ఆరోపణలు

జమ్ము కశ్మీర్​ నుంచి భారత జట్టుకు ఎంపికైన ఏకైక ఆటగాడు పర్వేజ్​ రసూల్​పై (Parvez Rasool) దొంగతనం ఆరోపణలు చేసింది ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్​ (JKCA). జిల్లా అసోసియేషన్​లో రోలర్​ చోరీ అయినట్లు పేర్కొంది. తిరిగి ఇవ్వకపోతే రసూల్​పై కేసు పెట్టాల్సి వస్తుందని తెలిపింది.

parvez rasool
పర్వేజ్ రసూల్​
author img

By

Published : Aug 21, 2021, 9:13 AM IST

భారత క్రికెటర్​ పర్వేజ్​ రసూల్​పై (Parvez Rasool) జమ్ము కశ్మీర్ క్రికెట్​ అసోసియేషన్​ (జేకేసీఏ) (JKCA) దొంగతనం ఆరోపణలు మోపింది. అసోసియేషన్​ పిచ్ రోలర్​ను అతడు చోరీ చేశాడని, తిరిగి ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. ఈ ఆరోపణలను పర్వేజ్​ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఓ అంతర్జాతీయ క్రికెటర్​తో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ మండిపడ్డాడు.

ఓ వార్త నివేదిక ప్రకారం భాజపాకు చెందిన బ్రిగేడియర్​ (రిటైర్డ్​) అనిల్ గుప్తా.. జేకేసీఏ సబ్​ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. అసోసియేషన్​లోని వస్తువులు చోరీకి గురయ్యాయని ఆయన ఫిర్యాదు చేశారు. రసూల్​ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా తరఫున అతని అడ్రస్​ మాత్రమే ఉండడం వల్ల అతనికి నోటీసులు పంపించామని పేర్కొన్నారు. "పర్వేజ్​ రసూల్​కు మాత్రమే కాదు శ్రీనగర్​లోని అన్ని జిల్లాల క్రికెట్​ అసోసియేషన్లకు లేఖలు రాశాం. అన్ని జిల్లాలకు ఎటువంటి వోచర్లు లేకుండా మెషినరీ పంపిణీ చేశాం. మా దగ్గర ఉన్న రిజిస్టర్​లో సంబంధిత వ్యక్తుల మెయిల్​ అడ్రస్​లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వారికే నోటీసులు పంపాం" అని గుప్తా పేర్కొన్నారు.

"జేకేసీఏకు సంబంధించి మెషినరీ మీ దగ్గర ఉంచాం. ప్రస్తుతం అందులో కొన్ని వస్తువులు లేవు. మీతో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ముందే చెబుతున్నాం. చట్టపరంగా ముందుకెళ్లక ముందే మీరు తీసుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేయండి. వారంలోపు ఇవ్వకపోతే మీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం" అని నోటీసులు పంపించడం వెనక ఉన్న కారణాన్ని గుప్తా వెల్లడించారు.

ఇలాగేనా వ్యవహరించేది?

జేకేసీఏ నోటీసులపై తీవ్రంగా స్పందించాడు రసూల్. తనను అడగడానికి ముందు జిల్లాలోని అనుబంధ సంస్థలను ప్రశ్నించాలని సూచించాడు.

"పర్వేజ్​ రసూల్​ అనే నేను జమ్ము కశ్మీర్​ నుంచి భారత జట్టుకు ఎంపికైన తొలి క్రికెటర్​ను. ఐపీఎల్, దులీప్​ ట్రోఫీ, దేవ్​దర్​ ట్రోఫీ, ఇండియా-ఏ, బోర్డు ప్రెసిడెంట్​ ఎలెవన్, ఇరానీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించాను. గత ఆరేళ్లుగా జమ్ము కశ్మీర్​ కెప్టెన్​గా, బీసీసీఐ నుంచి అత్యుత్తమ ఆల్​రౌండర్​గా రెండుసార్లు అవార్డు అందుకున్నాను. పిచ్ రోలర్​ దొంగిలించాననే అభియోగంతో ఈ రోజు నాకు జేకేసీఏ నుంచి లేఖ రావడం దురదృష్టకరం. నేను స్పష్టంగా చెప్తున్నా.. నేను ఏ రోలర్​, ఏ మెషినరీని తీసుకోలేదు" అని రసూల్​ బదులిచ్చాడు.

"ఓ అంతర్జాతీయ క్రికెటర్​ పట్ల ఈ విధంగానేనా మీరు ప్రవర్తించేది. అన్ని జిల్లాల్లో అనుబంధ సంస్థలు ఉన్నాయి. ముందు వాటిని అడగండి" అని రసూల్​ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: గందరగోళంలో అఫ్గాన్​ క్రికెట్.. భవిష్యత్ ఏంటో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.