ETV Bharat / sports

ఆ ఒక్క ఇన్నింగ్స్​.. తెలుగు కుర్రాడిని స్టార్​ని చేసింది..! - tilak varma parents

Tilak Varma: తెలుగు కుర్రాడు 19 ఏళ్ల తిలక్​ వర్మ.. ఐపీఎల్​లో ఒకే ఒక ఇన్నింగ్స్​తో స్టార్​గా మారిపోయాడు. రాజస్థాన్​ రాయల్స్​పై ఒత్తిడిలో అతడు ఆడిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే.. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన తిలక్​ కుటుంబానికి సొంత ఇల్లు లేదంట. ఐపీఎల్​లో వచ్చే ఆదాయంతో.. తల్లిదండ్రులకు ఇల్లు ఇవ్వడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.

We dont own a house as yet, will buy one with my IPL salary: MIs Tilak Varma

author img

By

Published : Apr 3, 2022, 5:26 PM IST

Tilak Varma: ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ తరఫున రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు 19 ఏళ్ల తెలుగు కుర్రాడు తిలక్​ వర్మ. సూర్యకుమార్​ యాదవ్​ లేని లోటును తీరుస్తూ టాప్​ ఆర్డర్​లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్​ మెగా వేలంలో.. రూ.1.7 కోట్లు పెట్టి ఇతడిని దక్కించుకుంది ముంబయి ఇండియన్స్​. తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ.. వరుసగా రెండు మ్యాచ్​ల్లో 22, 61 పరుగులు చేశాడు. స్ట్రైక్​ రేట్​ 173గా ఉండటం విశేషం.

MIs Tilak Varma
తల్లిదండ్రులతో తిలక్​ వర్మ

ముంబయి ఇండియన్స్​ నుంచి ఎందరో కుర్రాళ్లు.. స్టార్లుగా ఎదిగారు. జాతీయ జట్టులోనూ చోటు సంపాదించుకున్నారు. బుమ్రా, హార్దిక్, సూర్యకుమార్​ యాదవ్​, ఇషాన్​ కిషన్​​ ఇలా ఎందరో ఉన్నారు. ఇప్పుడు తిలక్​ కూడా ఆ జాబితాలో చేరినట్లే అనిపిస్తోంది. పేద కుటుంబానికి చెందిన తిలక్​ వర్మ.. జూనియర్​ స్థాయిలో విశేషంగా రాణించి వెలుగులోకి వచ్చాడు. 2020 అండర్​-19 వరల్డ్​కప్​కు ఎంపికైనా.. అక్కడ అంతగా రాణించలేకపోయాడు. అయినా అతడి కెరీర్​ను అవేమీ అడ్డుకోలేకపోయాయి. దేశవాళీల్లో అద్భుత ప్రదర్శనలతో ఐపీఎల్​ కాంట్రాక్టు దక్కింది. అతడికి ఇప్పటివరకు సొంత ఇల్లు లేదంట. ఇప్పుడు ఐపీఎల్​లో వచ్చే ఆదాయంతో.. ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నాడట.

''మేం పెరుగుతున్న కొద్దీ.. మాకు ఆర్థిక కష్టాలు పెరిగిపోయాయి. మా నాన్నకు వచ్చే కొద్దిపాటి జీతంతో.. నా క్రికెట్​ ఖర్చులు, అన్నయ్య చదువును చూసుకోవాల్సి వచ్చేది. కొంతకాలంగా స్పాన్సర్​షిప్స్​, క్రికెట్​ ఆడితే వచ్చితే డబ్బులతో నా ఖర్చులను నేనే చూసుకుంటున్నా. మాకు సొంత ఇల్లు లేదు. ఐపీఎల్​లో సంపాదించిన డబ్బుతో.. నా తల్లిదండ్రులకు ఇల్లు ఇవ్వడమే నా ఏకైక లక్ష్యం. వేలంలో నాకు దక్కిన ధర చూసి నా కోచ్​, తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.''

- తిలక్​ వర్మ, ముంబయి ఇండియన్స్​ క్రికెటర్

శనివారం జరిగిన మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన రాజస్థాన్​ రాయల్స్​.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. బట్లర్​ 100 పరుగులు చేశాడు. శాంసన్​(30), హెట్​మయర్​(35) రాణించారు. బుమ్రా, టైమల్​ మిల్స్​ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ముంబయికి శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే కెప్టెన్​ రోహిత్​(10) అవుటయ్యాడు. 40 పరుగుల వద్ద రెండో వికెట్​ పడిపోయింది. అప్పుడు ఇషాన్​ కిషన్​తో కలిసి దూకుడుగా ఆడాడు తిలక్​ వర్మ. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 33 బంతుల్లోనే 61 పరుగులు చేసి.. మ్యాచ్​ను గెలిపించినంత పనిచేశాడు. కానీ ఇన్నింగ్స్​ 15వ ఓవర్లో అశ్విన్​ వేసిన చక్కటి బంతికి బౌల్డయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన ముంబయి.. మ్యాచ్​ ఓడిపోయింది. తిలక్​ వర్మ ఇన్నింగ్స్​పై మాత్రం ప్రశంసలు కురుస్తున్నాయి. ముంబయి ఇండియన్స్​ తరఫున అర్ధసెంచరీ సాధించిన పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఇషాన్​ కిషన్​ 19 ఏళ్ల 278 రోజుల వయసులో ఈ ఘనతను అందుకోగా.. తిలక్​ 19 ఏళ్ల 145 రోజులకే చేరుకున్నాడు.

ఇవీ చూడండి: ఫైనల్లో 'హేలీ' ప్రపంచ రికార్డ్​.. ఇంగ్లాండ్​ ముందు భారీ లక్ష్యం

24 ఏళ్ల నాటి సచిన్ రికార్డు బ్రేక్​.. ఆ కెప్టెన్​ అరుదైన ఘనత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.