ETV Bharat / sports

కారణం తెలియడంలేదు.. కష్టంగా ఉంది: శ్రేయస్ - ఐపీఎల్ 2022

Shreyas Iyer: దిల్లీ క్యాపిటల్స్​ చేతిలో ఓటమితో వరుసగా తమ ఐదో మ్యాచ్​లోనూ పరాజయం నమోదు చేసింది కోల్​కతా నైట్​రైడర్స్​. ఈ క్రమంలోనే తమ వైఫల్యానికి సాకులు చెప్పబోనని అన్నాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలని అన్నాడు.

Shreyas Iyer
kkr vs dc
author img

By

Published : Apr 29, 2022, 9:37 AM IST

Shreyas Iyer: దిల్లీతో తలపడిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలవ్వడం వల్ల కోల్‌కతా ఈ సీజన్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌ కోల్పోయింది. దీంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. తమ ఓటమికి సాకులేమీ చెప్పట్లేదని తెలిపాడు. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకోవాలని చెప్పాడు.

"మేం చాలా పేలవంగా ఆరంభించాం. ఆదిలోనే వికెట్లు కోల్పోయాం. పిచ్‌ నెమ్మదిగా ఉన్నా మేం తగినన్ని పరుగులు చేయలేకపోయాం. మా ఓటమికి కారణాలేం లేవు. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవాలి. మా టాప్‌ఆర్డర్‌లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సరైన కాంబినేషన్‌ కనుగొనడానికి కష్టంగా ఉంది. ఇకపై సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. భయం వీడి దూకుడుగా ఆడాలి. ఇంకా ఐదు మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిల్లో బాగా ఆడాలి. జట్టులో నమ్మకం కలిగించి యాజమాన్యం నమ్మకాల్ని నిలబెట్టుకోవాలి. జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఇకపై గెలవడానికి కృషిచేయాలి. శక్తిమేరకు రాణించి విఫలమైనా పర్లేదు. ఉమేశ్‌ తొలి ఓవర్‌లోనే వికెట్‌ తీసినా 11 పరుగులిచ్చాడు. అక్కడే మ్యాచ్‌ టర్న్‌ అయింది. అయినా, ఈ సీజన్‌లో అతడు మాకు మంచి శుభారంభాలు అందించాడు"

-శ్రేయస్‌ అయ్యర్, కోల్​కతా కెప్టెన్

కాగా, కోల్‌కతా జట్టుకు ఈ సీజన్‌లో ఇది వరుసగా ఐదో ఓటమి. ఇంతకుముందు 2009లో బ్రెండన్‌ మెక్‌కలమ్‌ సారథ్యంలో ఆ జట్టు వరుసగా 9 మ్యాచ్‌లు కోల్పోయింది. ఇక 2019లోనూ దినేశ్‌ కార్తీక్‌ సారథ్యంలో ఆ జట్టు వరుసగా 6 ఓటములు చవిచూసింది. ఇప్పుడు శ్రేయస్‌ మరో మ్యాచ్‌ కోల్పోతే కార్తీక్‌ సరసన నిలిచి అనవసరపు రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు.

ఇదీ చూడండి: రాణించిన వార్నర్.. కోల్​కతాపై దిల్లీ విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.