ETV Bharat / sports

IPL హిస్టరీలో నాలుగో ప్లేయర్​గా రోహిత్​ రికార్డ్​.. బుంగమూతి పెట్టిన రితికా - ఐపీఎల్ 2023 లైవ్ స్కోరు

సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి కెప్టెన్​ రోహిత్ శర్మ ఓ రికార్డును సాధించాడు. ఆ వివరాలు..

IPL 2023 Sunrisers Hyderabad vs Mumbai Indians innings break
IPL హిస్టరీలో నాలుగో ప్లేయర్​గా రోహిత్​ రికార్డ్​.. బుంగమూతి పెట్టిన రితికా
author img

By

Published : Apr 18, 2023, 9:36 PM IST

Updated : Apr 18, 2023, 9:48 PM IST

ఐండియన్​ ప్రీమియర్ లీగ్​ 2023లో భాగంగా హైదరాబాద్​ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్​తో జరుగుతున్న మ్యాచులో టాస్ ఓడి ఫస్ట్​ బ్యాటింగ్​కు దిగిన ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ (64*; 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్​లు) హాఫ్​ సెంచరీతో మెరిసి ఆకట్టుకున్నాడు. తిలక్ వర్మ (37; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్​లు), రోహిత్ శర్మ (28; 18 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ఇషాన్ కిషన్ (38; 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్​లు) కూడా బాగానే రాణించాడు. టిమ్ డేవిడ్ (16) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సన్ రెండు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఒక్కో వికెట్ తీశారు.

నాలుగో ఆటగాడిగా.. ముంబయి ఇండియన్స్​ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్​లో ఓ ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఆరువేల పరుగుల మార్క్​ను అందుకున్నాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హిట్​మ్యాన్​ ఈ ఫీట్​ను సాధించాడు. దీంతో ఐపీఎల్‌ హిస్టరీలో ఆరు వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో అభిమానులు అతడికి అభినందనలు తెలుపుతున్నారు. రోహిత్‌ శర్మకు ఈ ఫీట్​ను అందుకోవడానికి 226 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. హిట్​ మ్యాన్​ కన్నా ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్​ విరాట్ కోహ్లీ 186 ఇన్నింగ్స్‌లలో, శిఖర్‌ ధావన్‌ 199 ఇన్నింగ్స్‌లలో, డేవిడ్‌ వార్నర్‌ 165 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించారు.

ఇక కోహ్లీ 6844 పరుగులతో(228 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శిఖర్‌ ధావన్‌ 210 మ్యాచ్‌ల్లో 6477 పరుగులు చేసి రెండో స్థానంలో, డేవిడ్‌ వార్నర్‌ 167 మ్యాచ్‌లు ఆడి 6109 పరుగులతో మూడో స్థానంలో, రోహిత్‌ శర్మ 232 మ్యాచ్‌లు ఆడి 6014 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచారు.

బుంగమూతి పెట్టిన రితికా.. అయితే దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ.. ఐదో ఓవర్​లో నటరాజన్‌ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి మిడాఫ్‌లో సన్​రైజర్స్​ కెప్టెన్​ మార్ క్రమ్​కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో హైదరాబాద్​లో భర్త ఆటను చూస్తూ ఎంజాయ్​ చేద్దామనుకున్నా రితికాకు నిరాశ మిగిలింది. హిట్​మ్యాన్​ ఔట్‌ అవ్వగానే బుంగమూతి పెట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇదీ చూడండి: CSK VS RCB : డుప్లెసిస్‌ రిబ్స్​పై ఉన్న ఆ టాటూ అర్థం తెలుసా?

Last Updated : Apr 18, 2023, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.