యువ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మెరుపులతో దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం హోరెత్తింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లందరూ విఫలమైన వేళ అక్షర్ పటేల్ మెరుపులతో దిల్లీ క్యాపిటల్స్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అక్షర్ పటేల్ 22 బంతుల్లో 36 పరుగులు చేసి చివరి ఓవర్లో వెనుదిరిగాడు. వార్నర్ 37, సర్ఫరాజ్ 30 పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది దిల్లీ. గెలవాలంటే గుజరాత్ టైటాన్స్ 163 పరుగులు చేయాల్సి ఉంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి మంచి ఆరంభమే దక్కింది. తొలి ఓవర్లో ఎక్స్‌ట్రాల రూపంలోనే ఎక్కువ పరుగులు వచ్చాయి. ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించేందుకు ప్రయత్నించారు. అయితే, మూడో ఓవర్లో పృథ్వీని వెనక్కి పంపించాడు మహమ్మద్ షమీ. ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్‌ను సైతం షమీ బోల్తా కొట్టించాడు. బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేయగా.. మార్ష్ డగౌట్‌కు వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగడంతో.. ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. వార్నర్ అడపాదడపా ఫోర్లు కొట్టినప్పటికీ.. సర్ఫరాజ్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. అతడి బ్యాటింగ్ టెస్టును తలపించింది. 9వ రెండో బంతికి ఓవర్లో డేవిడ్ వార్నర్(37) ఔట్ కాగా.. మూడో బంతికి రిలీ రూసో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అప్పటికి దిల్లీ స్కోరు 67-4.
ఈ దశ నుంచి దిల్లీ ఆ మాత్రం స్కోరు చేయగలిగిందంటే.. అదంతా అక్షర్ పటేల్, యువ కీపర్ అభిషేక్ పోరెల్ చలవే. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న 20 ఏళ్ల పోరెల్.. రెండు సిక్సులు బాది దిల్లీ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 11 బంతుల్లో 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక అక్షర్ పటేల్ బాధ్యతతో నిలబడ్డాడు. మంచి టైమింగ్‌తో భారీ షాట్లు ఆడాడు. 2 ఫోర్లు 3 సిక్సుల సాయంతో 36 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీశాడు. జాషువా లిటిల్, హార్దిక్ పాండ్య పొదుపుగా బౌలింగ్ చేశారు.
మ్యాచ్‌కు పంత్
గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దిల్లీ ఆటగాడు రిషభ్ పంత్ మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. తమ జట్టును ఉత్సాహపరిచేందుకు అతడు స్టేడియంకు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్.. తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది.