టీమ్‌ఇండియా పేసర్, ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా చాలా రోజుల తర్వాత స్టేడియంలో కనువిందు చేశాడు. సర్జరీ తర్వాత తొలిసారి మైదానంలో అభిమానుల మధ్య సందడి చేశాడు. ముంబయి ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు హాజరయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.
టాస్ అనంతరం బుమ్రా తమ జట్టుకు చీర్స్ చెబుతున్న ఫొటోను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్‌మీడియాలో తమ అధికార ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. 'బూమ్.. బూమ్.. బుమ్రా..' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో చాలా రోజుల తర్వాత బుమ్రాను చూసిన ముంబయి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా జట్టులోకి రావాలని ఆశిస్తున్నారు.
-
𝗕𝗢𝗢𝗠 𝗕𝗢𝗢𝗠… 𝘽𝙐𝙈𝙍𝘼𝙃 🤩💙#OneFamily #GTvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @Jaspritbumrah93 pic.twitter.com/dxcJ20jSia
— Mumbai Indians (@mipaltan) April 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝗕𝗢𝗢𝗠 𝗕𝗢𝗢𝗠… 𝘽𝙐𝙈𝙍𝘼𝙃 🤩💙#OneFamily #GTvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @Jaspritbumrah93 pic.twitter.com/dxcJ20jSia
— Mumbai Indians (@mipaltan) April 25, 2023𝗕𝗢𝗢𝗠 𝗕𝗢𝗢𝗠… 𝘽𝙐𝙈𝙍𝘼𝙃 🤩💙#OneFamily #GTvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @Jaspritbumrah93 pic.twitter.com/dxcJ20jSia
— Mumbai Indians (@mipaltan) April 25, 2023
గత నెలలోనే అతడు గాయానికి సర్జరీ చేయించుకునేందుకు న్యూయార్క్ పయనమయ్యాడు. కాగా గాయం కారణంగా గతేడాది జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ తోపాటు ఈ ఏడాది స్వదేశంలో జరిగిన అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరమయ్యాడు. కానీ రీసెంట్గా సర్జరీ చేయించుకున్న అతడికి మరింత విశ్రాంతి అవసరం. ప్రస్తుతం అతను బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నాడు. ఐపీఎల్‌లో ప్రస్తుతం అతడు ఆడలేడు. అందుకే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌కు కూడా అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బుమ్రాకు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది.
గత శుక్రవారమే అతడు ఎన్సీఏకు వెళ్లాడు. ఇక 2023లో భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని బుమ్రా భావిస్తున్నాడు. 2016లో ఇండియన్ టీమ్ తరఫున అరంగేట్రం చేసిన బుమ్రా.. ఇప్పటి వరకూ 30 టెస్టులు, 72 వన్డేలు, 60 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ విజయాల్లోనూ అతడు కీలకపాత్ర పోషించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది గుజరాత్ టైటాన్స్. గుజరాత్ బ్యాటర్లు ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. శుభమన్ గిల్ (56; 34 బంతుల్లో 7x4, 1x6) మెరుపులు మెరిపించాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (46; 22 బంతుల్లో 2x4, 4x6), అభినవ్ మనోహర్ (42; 21 బంతుల్లో 3x4, 3x6), రాహుల్ తెవాతియా (20; 5 బంతుల్లో 3x6) చెలరేగి బ్యాట్‌ను ఝళిపించారు. ముంబయి బౌలర్లలో పీయూష్ చావ్లా 2, అర్జున్ తెందుల్కర్, బెరెన్ డార్ఫ్, మెరిడీత్, కుమార్ కార్తికేయ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇదీ చూడండి: ipl 2023 MI VS GT : గిల్ వర్సెస్ అర్జున్.. సారా సపోర్ట్ ఎవరికో?