IPL 2022 new Jersy: ఐపీఎల్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన నిర్వహణ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. మరో రెండు రోజుల్లో (12,13 తేదీల్లో) మెగావేలం జరగనుంది. రెండు కొత్త జట్లు అదనంగా రావడం వల్ల ఈ సారి పది టీమ్స్ బరిలో దిగడం, ఏ ప్లేయర్.. ఏ ఫ్రాంఛైజీ ఒడికి చేరుతాడో అని అభిమానుల్లో విపరీతంగా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సారి పలు ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్ల కోసం కొత్త జెర్సీలను ఆవిష్కరించిన్నట్లు తెలిసింది. స్పాన్సర్లు కూడా మారారు. ఈ నేపథ్యంలో ఏ జట్టుకు ఎవరు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు.. వారి నయా జెర్సీ ఏంటో చూసేద్దాం..
కొత్త స్పాన్సర్లు
చెన్నై సూపర్ కింగ్స్-టీవీఎస్ యూరోగ్రిప్
ముంబయి ఇండియన్స్-స్లైస్
సన్‌రైజర్స్ హైదరాబాద్-కార్స్ 24
లక్నో సూపర్ జెయింట్స్-మై 11 సర్కిల్
గుజరాత్ టైటాన్స్(స్లైస్.. పరిశీలనలో ఉంది)
రాజస్థాన్ రాయల్స్(ఖరారు కాలేదు)
పాత స్పాన్సర్లతో కొనసాగనున్న జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముత్తూట్ ఫిన్‌కార్ప్
దిల్లీ క్యాపిటల్స్-జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్
పంజాబ్ కింగ్స్-ఎబిక్స్ క్యాష్
కోల్‌కతా నైట్ రైడర్స్-ఎంపీఎల్
మరి కొన్ని విశేషాలు
పది ఫ్రాంచైజీలు 33 మంది ఆటగాళ్లను అట్టిపెటుకున్నాయి.
మెగావేలంలో భాగంగా రూ.900కోట్లలో ఇప్పటికే రూ.343.7కోట్లు ఆయా ఫ్రాంచైజీలు ఖర్చు చేశాయి. ఇంకా రూ.556కోట్లు మిగిలి ఉన్నాయి.
మొత్తంగా ఈ మెగా వేలంలో పాల్గొనేందుకు మొత్తం 590 మంది క్రికెటర్లు పోటీపడుతున్నారు.
వీరిలో 228 మంది అంతర్జాతీయ క్రికెటర్లు కాగా, మరో 355 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లుగా ఉన్నారు. మరో ఏడుగురు అసోసియేట్ దేశాల క్రికెటర్లూ ఇందులో పాల్గొంటున్నారు.
కాగా, ఈ ఏడాది రెండు కొత్త జట్లు చేరాయి. అందులో ఒకటి అహ్మదాబాద్ టైటాన్స్ కాగా, రెండోది లఖ్‌నవూ సూపర్ జెయింట్స్.
ఇదీ చూడండి: రంజీ ట్రోఫీలో యష్ ధుల్.. ఏ జట్టుకు ఆడనున్నాడంటే?