India Fast Bowling Future : సౌతాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమి అనేక చర్చలకు దారి తీస్తోంది. ముఖ్యంగా జట్టు పేస్ బౌలింగ్ అత్యంత పేలవంగా ఉందనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించినప్పటికీ మహ్మద్ సిరాజ్ (2) స్థాయికి తగ్గట్లు రాణించలేదు. మరీ ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ ఘోరంగా విఫలమయ్యాడు. ఠాకూర్ ఏకంగా 5.30 ఏకనమీతో 101 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో టీమ్ఇండియా బౌలింగ్ భారాన్ని మోసేది ఎవరు? పేస్‌కు నాయకత్వం వహించేంది ఎవరు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి!
ఒకప్పుడు టీమ్ఇండియాకు టెస్టు, వన్డేల్లో ఆశిష్ నెహ్రా, ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్, జహీర్‌ఖాన్ ఉండేవారు. వీరి తర్వాత ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా ఆ భారాన్ని మోస్తూ అందరి అంచనాలను అందుకున్నారు. టీమ్ఇండియాకు స్వదేశం, విదేశీ పిచ్‌లపై అత్యుత్తమ ప్రదర్శన చేశారు. జట్టుకు సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్లో విదేశీ (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) పిచ్‌లపై విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కానీ, వీళ్ల తర్వాత అంతటి పేస్ దళాన్ని తయారుచేయడానికి మేనేజ్మెంట్ కసరత్తులు చేయట్లేదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా విదేశీ గడ్డపై ఆడే టెస్టుల్లో ప్రభావం చూపే పేసర్లే కరవయ్యారు.
-
Jasprit Bumrah's is absolutely sensational! 👏
— Vipin Tiwari (@Vipintiwari952_) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
pic.twitter.com/KZYhxXF9Rz
">Jasprit Bumrah's is absolutely sensational! 👏
— Vipin Tiwari (@Vipintiwari952_) December 27, 2023
pic.twitter.com/KZYhxXF9RzJasprit Bumrah's is absolutely sensational! 👏
— Vipin Tiwari (@Vipintiwari952_) December 27, 2023
pic.twitter.com/KZYhxXF9Rz
ప్రస్తుతం టీమ్ఇండియాలో నవదీప్ సైని, ఉమ్రాన్ మలిక్, ఖలీల్ అహ్మద్,అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, శివమ్ మావి, మోసిన్ ఖాన్, చేతన్ సకారియా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. కానీ, వీళ్లంతా ఇప్పటికైతే టీ20, వన్డేలకు పరిమితమయ్యారు. అయితే జట్టులో ఇప్పుడున్న షమీ, ఉమేశ్, ఇషాంత్ ఇంకా కొంతకాలమే క్రికెట్ ఆడుతారు. సిరాజ్, బుమ్రా జట్టులో ఉన్నప్పుడే, యంగ్ పేసర్లపై దృష్టి పెట్టి వారిని అత్యుత్తమంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి మేనేజ్మెంట్ ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టాలి. లేకపోతే భవిష్యత్‌లో విదేశీ పిచ్‌లపై ఆడే రెడ్‌బాల్ క్రికెట్లో టీమ్ఇండియా అనేక ఓటములు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు రెండు షాక్‌లు- టాప్ ప్లేస్ ఔట్, ఐసీసీ ఫైన్!
తొలి టెస్టులో టీమ్ఇండియా ఘోర ఓటమి - ఇన్నింగ్స్ తేడాలో సఫారీల గెలుపు