ETV Bharat / sports

రోహిత్‌.. తొలి కెప్టెన్​గా సరికొత్త రికార్డు! - రోహిత్ శర్మ రికార్డ్​

IND vs WI Rohith Sharma: టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టీమ్‌ఇండియా తరఫున మూడు, అంతకన్నా ఎక్కువ సిరీస్‌లు వైట్‌వాష్‌ చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్​తో ఈ ఘనత సాధించాడు.

rohit sharma
రోహిత్ శర్మ
author img

By

Published : Feb 21, 2022, 1:53 PM IST

Rohit Sharma New Record: టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ కొత్త చరిత్ర సృష్టించాడు. టీమ్‌ఇండియా తరఫున మూడు, అంతకన్నా ఎక్కువ సిరీస్‌లు వైట్‌వాష్‌ చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. గతరాత్రి వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20లో భారత్‌ 17 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో పొట్టి సిరీస్‌ను భారత్​ సొంతం చేసుకుంది. అంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా 3-0 తేడాతోనే కైవసం చేసుకుంది. దీంతో ఈ పర్యటనలో కరీబియన్‌ జట్టు ఒక్క విజయం సాధించకుండానే ఇంటిముఖం పట్టింది. మరోవైపు రోహిత్‌ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా ఇదివరకు మూడు సార్లు ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. 2017లో శ్రీలంకపై, 2018లో వెస్టిండీస్‌పై, 2021లో న్యూజిలాండ్‌పై అన్ని మ్యాచ్‌లూ గెలుపొందింది.

  • గత నాలుగు టీ20 సిరీస్‌ల్లో వెస్టిండీస్‌పై టీమ్‌ఇండియా ప్రదర్శన..

2018లో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో టీమ్‌ఇండియా 3-0తో విజయం.
2019లో వెస్టిండీస్‌ పర్యటనలోనూ 3-0తో గెలుపు.
2019లో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌ 2-1తో విజయం.
2022లో స్వదేశంలోనే 3-0తో సిరీస్‌ కైవసం.

  • టీ20ల్లో టీమ్‌ఇండియాకు అత్యధిక సార్లు వరుస విజయాలు సాధించిన సందర్భాలు..

2020 జనవరి - డిసెంబర్‌ మధ్య 9 విజయాలు.
2021 నవంబర్‌ - 2022 ఫిబ్రవరి మధ్య 9 విజయాలు.
2012 డిసెంబర్‌ - 2014 ఏప్రిల్‌ మధ్య 7 విజయాలు.
2016 ఫిబ్రవరి - మార్చి మధ్య 7 విజయాలు.
2018 మార్చి - జులై మధ్య 7 విజయాలు.

  • టీ20ల్లో కెప్టెన్‌గా వరుసగా అత్యధిక విజయాలు సాధించిన సారథులు..
    12 అస్గర్‌ అఫ్గాన్‌ అఫ్గానిస్థాన్‌ (2018-2020)
    9 సర్ఫరాజ్‌ అహ్మద్‌ పాకిస్థాన్‌ (2018)
    9 రోహిత్‌ శర్మ భారత్‌ (2019-2022)
  • టీ20ల్లో అత్యధిక ఓటములు చెందిన జట్లు (సూపర్‌ ఓవర్లతో సహా)
    83 వెస్టిండీస్‌
    82 శ్రీలంక
    78 బంగ్లాదేశ్‌
    76 న్యూజిలాండ్‌

ఇదీ చదవండి: నేను భయపడే రకం కాదు.. ఎలా ఆడాలో తెలుసు!: రోహిత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.