శ్రీలంకతో జరుగుతోన్న చివరిదైన మూడో వన్డేకు వరుణుడు అడ్డుతగిలిలాడు. 23వ ఓవర్లో వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. ధావన్ 13పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమ్ఇండియా 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (22), మనీష్ పాండే (10) క్రీజులో ఉన్నారు.