టీమ్ఇండియాతో జరుగతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 254 పరగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక 133/8 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్.. ఆదనంగా మరో 17 పరుగులు చేసి ఆలౌటైంది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్ల ప్రదర్శనతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు కీలక వికెట్ల పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, అశ్విన్ తలా వికెట్ సాధించారు.
కాగా, బంగ్లా ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ రహీమ్ (28) టాప్ స్కోరర్ కాగా.. జకీర్ హసన్ 20, లిటన్ దాస్ 24 పరుగులు చేశారు. ఇకపోతే బంగ్లాను ఫాలో ఆన్ ఆడించకుండా.. బ్యాటింగ్ చేయడానికే భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ మొగ్గు చూపాడు.
ఇదీ చూడండి: సచిన్ అడ్వైస్తోనే అర్జున్ సెంచరీ.. అలా చేయమని చెప్పాడంటా..