బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాటర్లు జోరు ప్రదర్శిస్తున్నారు. భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్నారు. 35 ఓవర్లు ముగసేసరికి 295 పరుగలు చేశారు. ఇషాన్ కిషనైతే వీరవిహారం చేస్తూ ఏకంగా డబుల్ సెంచరీతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడేస్తున్నాడు. కేవలం 126 బంతుల్లోనే 23 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో ద్విశతకం సాధించాడు. 85 బంతుల్లో సెంచరీ సాధించిన ఇషాన్.. మరో 41 బంతుల్లోనే ఇంకో శతకం పూర్తి చేయడం విశేషం.
ఈ మార్క్‌తో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన 7వ క్రికెటర్‌గా నిలిచాడు. అలానే వన్డేల్లో ద్విశతకం సాధించిన 4వ భారత క్రికెటర్‌గానూ ఘనత సాధించాడు. ఇక స్టార్ బ్యాటర్ కోహ్లీ కూడా దూకుడుగా ఆడుతూ సెంచరీ బాదాడు. 86 బంతుల్లో 104 పరుగులు సాధించాడు. అందులో 11 ఫోర్లు, ఓ సిక్స్ ఉంది. ఈ మార్క్‌తో వన్డేల్లో 44వ శతకం నమోదు చేసిన ఆడగాడిగా విరాట్ నిలిచాడు. అలాగే అతడికి ఇది అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 72వ శతకం.
భారత్ నుంచి నలుగురే.. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు తొమ్మిది డబుల్ సెంచరీలు నమోదు కాగా.. అందులో భారత్ నుంచే నలుగురు బ్యాటర్లు ఆరు ద్విశతకాలు బాదారు. టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ ఏకంగా మూడుసార్లు (264, 209, 208*) డబుల్ సెంచరీలు చేశాడు. అలాగే వ్యక్తిగత స్కోర్లలో రోహిత్ (264) టాప్ కావడం గమనార్హం. భారత్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్ (219), సచిన్ తెందూల్కర్ (200*) కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇక అంతర్జాతీయంగా మార్టిన్ గప్తిల్ (237*, కివీస్), క్రిస్ గేల్ (215, విండీస్), ఫఖర్ జమాన్ (210*) కూడా ద్విశతకాలను సాధించారు.
-
𝟐𝟎𝟎 𝐑𝐔𝐍𝐒 𝐅𝐎𝐑 𝐈𝐒𝐇𝐀𝐍 𝐊𝐈𝐒𝐇𝐀𝐍 🔥🔥
— BCCI (@BCCI) December 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
𝐖𝐡𝐚𝐭 𝐚 𝐬𝐞𝐧𝐬𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐝𝐨𝐮𝐛𝐥𝐞 𝐡𝐮𝐧𝐝𝐫𝐞𝐝 𝐭𝐡𝐢𝐬 𝐡𝐚𝐬 𝐛𝐞𝐞𝐧.
He is the fourth Indian to do so. Take a bow, @ishankishan51 💥💥#BANvIND pic.twitter.com/Mqr2EdJUJv
">𝟐𝟎𝟎 𝐑𝐔𝐍𝐒 𝐅𝐎𝐑 𝐈𝐒𝐇𝐀𝐍 𝐊𝐈𝐒𝐇𝐀𝐍 🔥🔥
— BCCI (@BCCI) December 10, 2022
𝐖𝐡𝐚𝐭 𝐚 𝐬𝐞𝐧𝐬𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐝𝐨𝐮𝐛𝐥𝐞 𝐡𝐮𝐧𝐝𝐫𝐞𝐝 𝐭𝐡𝐢𝐬 𝐡𝐚𝐬 𝐛𝐞𝐞𝐧.
He is the fourth Indian to do so. Take a bow, @ishankishan51 💥💥#BANvIND pic.twitter.com/Mqr2EdJUJv𝟐𝟎𝟎 𝐑𝐔𝐍𝐒 𝐅𝐎𝐑 𝐈𝐒𝐇𝐀𝐍 𝐊𝐈𝐒𝐇𝐀𝐍 🔥🔥
— BCCI (@BCCI) December 10, 2022
𝐖𝐡𝐚𝐭 𝐚 𝐬𝐞𝐧𝐬𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐝𝐨𝐮𝐛𝐥𝐞 𝐡𝐮𝐧𝐝𝐫𝐞𝐝 𝐭𝐡𝐢𝐬 𝐡𝐚𝐬 𝐛𝐞𝐞𝐧.
He is the fourth Indian to do so. Take a bow, @ishankishan51 💥💥#BANvIND pic.twitter.com/Mqr2EdJUJv
ఇదీ చూడండి: బంగ్లాతో టెస్ట్ సిరీస్.. షమీ స్థానంలోకి అతడు.. 12ఏళ్ల తర్వాత ఛాన్స్!