ఇంగ్లాండ్ బ్రిస్టోల్ వేదికగా కౌంటీ ఛాంపియన్షిప్లో భాగంగా ఓ మ్యాచ్ జరుగుతుండగా అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. మైదానంలో హెలికాప్టర్ దిగిన కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. గ్లౌసెస్టర్షైర్, దుర్హామ్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ సంఘటన జరిగింది.
ఏం జరిగిందంటే?
టాస్ గెలిచిన దుర్హామ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్ ప్రారంభం కాగానే అంపైర్ సహా ఆటగాళ్లందరూ మైదానం విడిచివెళ్లారు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న కారణంగా ఇలా చేశారు. అనంతరం అది 'గ్రేట్ వెస్టర్న్ ఎయిర్ అంబులెన్స్' సంస్థకు చెందిన హెలికాప్టర్ అని తెలిసింది. డొనేషన్ల ద్వారా నడిచే ఈ సంస్థ.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. మైదానం వెలుపల ఓ ఘటన జరిగిన నేపథ్యంలో ఆ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయినట్లు సంస్థ పేర్కొంది.
-
A Great Western Air Ambulance has landed on the outfield due to a critical incident nearby.
— Durham Cricket (@DurhamCricket) September 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Play will commence as soon as possible.
pic.twitter.com/Tpguw1Fso8
">A Great Western Air Ambulance has landed on the outfield due to a critical incident nearby.
— Durham Cricket (@DurhamCricket) September 21, 2021
Play will commence as soon as possible.
pic.twitter.com/Tpguw1Fso8A Great Western Air Ambulance has landed on the outfield due to a critical incident nearby.
— Durham Cricket (@DurhamCricket) September 21, 2021
Play will commence as soon as possible.
pic.twitter.com/Tpguw1Fso8
హెలికాప్టర్ మైదానంలో దిగిన తర్వాత.. ఘటనకు సంబంధించిన బాధితుడిని తీసుకొని వెళ్లేందుకు 20 నిమిషాల సమయం పట్టింది. అనంతరం మళ్లీ మ్యాచ్ యథావిధిగా జరిగింది. అత్యవసర సేవల నిమిత్తం మైదానంలో ఆటగాళ్లు పక్కకు తప్పుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు జీడబ్ల్యూఏఏసీ సంస్థ సీఈఓ అన్నా పెర్రీ. ఆటగాళ్లకు, అంపైర్లకు ధన్యవాదాలు తెలిపారు.
మ్యాచ్ జరుగుతుండగా ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. 2018లో ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది.
ఇదీ చదవండి: