ETV Bharat / sports

Heath Streak Death : లెజెండరీ క్రికెటర్​ బతికే ఉన్నారా.. ఆ వార్త నిజం కాదా?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 8:01 AM IST

Updated : Aug 23, 2023, 12:59 PM IST

Heath Streak Death : జింబాబ్వే క్రికెట్ లెజెండ్ హీత్ స్ట్రీక్(49) క్యాన్సర్​తో పోరాడుతూ కన్నుమూశాడంటూ... అతడి అనుచరుడు హెన్రీ ఒలొంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ విషయంపై అతడు యూటర్న్ తీసుకున్నాడు.

Heath Streak Death
క్యాన్సర్​తో లెజెండరీ క్రికెటర్​ కన్నుమూత

Heath Streak Death : జింబాబ్వే క్రికెట్ లెజెండ్ హీత్ స్ట్రీక్(49) క్యాన్సర్​తో పోరాడుతూ కన్నుమూసినట్లు అతడి అనుచరుడు హెన్రీ ఒలొంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకుంటున్న క్రికెట్ ప్రముఖులు, అతడి అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. అయితే హెన్రీ ఇప్పుడు మరో కొత్త పోస్ట్ చేస్తూ క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. హీట్​ స్ట్రీక్​ బతికే ఉన్నాడని, తనకు వచ్చిన సమాచారం తప్పుడు వార్త అని చెప్పాడు. కాగా, సౌతాఫ్రికాకు చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ దగ్గర హీట్​ చికిత్స తీసుకుంటున్నట్లు గత మే నెలలో అతడి కుటుంబ సభ్యులు చెప్పారు.

అయితే హెన్రీ కొత్త ట్వీట్​ చూసిన క్రికెట్​ అభిమానులు అతడిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి విషాదకర వార్తలను ధ్రువీకరించకుండా ట్వీట్​ చేయడం సరైన పద్ధతి కాదని ఫైర్ అవుతున్నారు. " అవన్నీ రూమర్స్​. హీత్​ స్ట్రీక్​ బతికే ఉన్నారు. థర్డ్‌ అంపైర్‌ అతడిని వెనక్కి పిలిచాడు" అంటూ హెన్రీ మరో ట్వీట్‌ చేశాడు.

  • I can confirm that rumours of the demise of Heath Streak have been greatly exaggerated. I just heard from him. The third umpire has called him back. He is very much alive folks. pic.twitter.com/LQs6bcjWSB

    — Henry Olonga (@henryolonga) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతకుముందు ట్వీట్​లో "హీట్​ స్ట్రీక్​ను(Heath streak passed away) కోల్పోవడం చాలా బాధకరమైన విషయం. ఒక లెజెండ్​ను కోల్పోయాం. ప్రపంచ క్రికెట్​లో ఓ గొప్ప ఆల్ రౌండర్. మీతో ఆడడం చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు మీరు లేకపోవడం చాలా బాధకరంగా ఉంది" అని రాసుకొచ్చాడు.

Heath Streak Career : జింబాబ్వే జట్టును ఒకప్పుడు మేటి జట్టుగా తీర్చిదిద్దిన ఘనత హీత్​ స్ట్రీక్​కే దక్కుతుంది. ఆ జట్టుకు మాజీ కెప్టెన్, ఆల్​రౌండర్​, ఫాస్ట్ బౌలర్​గా సేవలిందించాడు. అతడి ఆల్ రౌండర్ ఆటతీరు జింబాబ్వే జట్టుకు ఎన్నో గొప్ప విజయాలను అందించింది. కెరీర్​లో 65 టెస్టుల్లో 216 వికెట్లు తీసి 1990 పరుగులు , 189 వన్డేల్లో 239 వికెట్లు తీసి 2942 రన్స్ ​చేశాడు స్ట్రీక్​. జింబాబ్వే తరపున 100 టెస్ట్ వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్​గా నిలిచాడు. 1993 నుంచి 2005 వరకు దాదాపు 12 సంవత్సరాల పాటు జాతీయ జట్టుకు సేవలందించాడు. 1993లో పాకిస్థాన్​పై అరంగేట్రం చేశాడు. 2000 నుంచి 2004 వరకు జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు. 2005లో సెప్టెంబర్​లో టీమ్​ఇండియాపై(Heath Streak vs India) చివరి టెస్ట్ ఆడి.. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.

బౌలింగ్​లో ఎంతో గొప్పగా రాణించిన అతడు.. మిడిల్ ఆర్డర్‌లోనూ బ్యాట్‌తో అద్భుతమైన సహకారం అందించేవాడు. హరారే వేదికగా వెస్టిండీస్‌పై తన తొలి ఏకైక టెస్టు సెంచరీని (127*) సాధించాడు. 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ (ICL) కూడా ఆడాడు. కోచ్​గానూ రాణించాడు. జింబాబ్వే, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, కోల్‌కతా నైట్ రైడర్స్‌, గుజరాత్ లయన్స్​కు కోచ్​గా కూడా సేవలు అందించాడు.

Shikhar Dhawan Asia Cup 2023 : ధావన్ 'ఆట' ఇక గతమేనా?.. గబ్బర్‌​ను మళ్లీ జట్టులో చూడగలమా?

Rinku Singh 5 Sixes : 'ఆ 5 సిక్సులు నా జీవితాన్నే మార్చేశాయి.. స్టాండ్స్​లో ఫ్యాన్స్​ అలా చేస్తే చాలా ఇష్టం'

Last Updated : Aug 23, 2023, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.