ETV Bharat / sports

'దూస్రా కింగ్​'ను చూస్తే దిగ్గజాలకే హడల్​ - క్రీడా వార్తలు తాజా

Harbhajan Singh Retirement: ఆఫ్‌ సైడ్‌కు వెళ్లిపోతుందిలే అని వదిలేసిన బంతి ఉన్నట్టుండి టర్న్‌ తీసుకుని బెయిల్స్‌ను ఎగరేసేది.. నెమ్మదిగా వస్తున్నట్లే కనిపించే బంతి సర్రున దూసుకొచ్చి వికెట్లను కూలదోసేది..! ఫ్లయిటెడ్‌ డెలివరీయే కదా అని ముందుకెళితే బంతి బ్యాట్‌ ప్యాడ్‌ మధ్య దూరిపోయేది! ఇలా బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెట్టి వికెట్ల పంట పండించుకున్న బౌలరే హర్భజన్‌ సింగ్‌.. ది టర్బోనేటర్‌!

Harbhajan Singh Retirement
దూస్రా కింగ్​, ది టర్బోనేటర్​-హర్భజన్​ సింగ్​
author img

By

Published : Dec 25, 2021, 7:38 AM IST

Harbhajan Singh Retirement: 90ల్లో భారత క్రికెట్లో స్పిన్నర్‌ అంటే అనిల్‌ కుంబ్లేనే..! కానీ ఆ దశకం చివర్లో అనిల్‌కు హర్భజన్‌ జత కలిశాడు. గాయం కారణంగా ఏడాది పాటు కుంబ్లే దూరం కావడం వల్ల వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందుకున్నాడు హర్భజన్‌. బక్కపలచని శరీరం.. ఇంకా పసితనం వీడలేదా అన్నట్లు ఉన్న మొహం! అప్పట్లో భజ్జీని చూస్తే జంబోకే ఇతడేం ప్రత్యామ్నాయం అనుకున్నారంతా. కానీ అరంగేట్ర వన్డే సిరీస్‌లో పెద్దగా రాణించలేకపోయిన ఈ ఆఫ్‌స్పిన్నర్‌.. ఆ తర్వాత నాన్న చనిపోవడం, బౌలింగ్‌ యాక్షన్‌పై అనుమానాలు రేకెత్తడం లాంటి కారణాలతో కొంత కాలం క్రికెట్‌కు దూరమయ్యాడు. ఒక దశలో అమెరికా కూడా వలస వెళ్లిపోదామని అనుకున్నాడు.

కానీ అప్పటి కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అండగా నిలవడం వల్ల ఆ ఆలోచనలు మార్చుకున్నాడు. దాదా మాటలతో మానసికంగా బలపడ్డాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీకి వచ్చి తన బౌలింగ్‌ శైలిలో మార్పులు చేసుకున్నాడు. ఆ తర్వాత కుంబ్లే గైర్హాజరుతో 2001లో ఆసీస్‌తో సిరీస్‌లో అతడిని ఎంపిక చేశాడు అప్పటి కోచ్‌ జాన్‌ రైట్‌. భారత క్రికెట్లో మేలి మలుపు లాంటి ఈ సిరీసే భజ్జీ రాతను మార్చింది. బౌలింగ్‌ శైలిని మార్చుకుని వచ్చిన అతడు కంగారూలపై విశ్వరూపమే చూపించాడు. వరుసగా 16 టెస్టు విజయాలతో అప్రతిహతంగా దూసుకెళ్తున్న ఆస్ట్రేలియాకు బ్రేక్‌ వేయడంలో కీలకపాత్ర పోషించింది హర్భజనే. కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన ఆ టెస్టులో బ్యాటింగ్‌లో లక్ష్మణ్‌-ద్రవిడ్‌.. బౌలింగ్‌లో హర్భజన్‌ చెలరేగి ఫాలోఆన్‌లో ఉన్న జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్‌వా, పాంటింగ్‌, గిల్‌క్రిస్ట్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ చేశాడు భజ్జీ.

అంతేకాదు టెస్టుల్లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆ సిరీస్‌లో మిగతా బౌలర్లంతా కలిసి 17 వికెట్లు తీస్తే.. భజ్జీ ఒక్కడే 17.03 సగటుతో 32 వికెట్లు పడగొట్టాడంటేనే అతడు ఎంతటి ప్రభావాన్ని చూపించాడో అర్థం చేసుకోవచ్చు. ఆ సిరీస్‌ తర్వాత అతడిని టర్బోనేటర్‌ అని ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు. కుంబ్లేకు ప్రత్నామ్నాయంగా వచ్చిన అతడు ఈ సిరీస్‌ ముగిశాక ప్రధాన బౌలర్‌గా మారిపోయాడు. అనిల్‌ పునరాగమం చేసిన తర్వాత కూడా అతడి చోటుకు ఢోకా లేకుండాపోయింది. అప్పటి వరకు స్పిన్నర్‌ అంటే కుంబ్లేకు సహాయక పాత్ర మాత్రమే పోషించేవాళ్లు.. కానీ భజ్జీ మాత్రం అనిల్‌ లాంటి మేరునగం నీడలోనూ దిగ్గజంగా ఎదిగాడు. టెస్టుల్లో నమ్మదగ్గ స్పిన్నర్‌గా ఎదిగాడు. రిప్పర్లు, దుస్రా లాంటి ఆయుధాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపైనే కాక బౌన్స్‌ ఉండే పిచ్‌లపై వికెట్ల తీసి సత్తా చాటాడు భజ్జీ. స్పిన్నర్లకు అతి కష్టంగా భావించే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ గడ్డలపై అతడి బౌలింగే ఇందుకు నిదర్శనం. ఈ మూడు చోట్లా అతడు అయిదేసి వికెట్ల ప్రదర్శనలు చేశాడు. బంతిని మరీ స్పిన్‌ చేయకున్నా ఫ్లయిటెడ్‌ డెలివరీలు, ఉన్నట్టుండి వేగాన్ని తగ్గిస్తూ వేసే మ్యాజిక్‌ బంతులతో వికెట్లు తీసేవాడు.

పాంటింగ్‌.. పన్నెండుసార్లు

ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్‌ను భజ్జీ బాగా ఇబ్బంది పెట్టేవాడు. ఇందులో అతడి బాధితుల జాబితా పెద్దదే. స్టీవ్‌వా, కలిస్‌, రికీ పాంటింగ్‌ లాంటి కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు కూడా కొరకరాని కొయ్యలా ఉండేవాడు. మేటి బ్యాట్స్‌మెన్‌ అయిన పాంటింగ్‌ను పన్నెండుసార్లు ఔట్‌ చేశాడు. 2007-11 మధ్య కాలంలో టెస్టుల్లో మాత్రమే కాదు వన్డేల్లోనూ ప్రభావవంతమైన బౌలర్‌గా మారాడు హర్భజన్‌. 2011 వన్డే ప్రపంచకప్‌ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. సెమీస్‌లో ఓ అద్భుత బంతితో ఉమర్‌ అక్మల్‌ను ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. బౌలింగ్‌లోనే కాదు లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌లోనూ తన వంతు పాత్ర పోషించాడు హర్భజన్‌. సౌరభ్‌ గంగూలీ, ధోని కెప్టెన్సీలో విదేశాల్లో జట్టు సాధించిన కీలక టెస్టు విజయాల్లో భజ్జీ పాత్ర ఉంది.

భజ్జీ కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. 2008లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్‌లో సైమండ్స్‌తో మంకీ గేట్‌ వివాదం, ఐపీఎల్‌లో శ్రీశాంత్‌ను చెంప మీద కొట్టడం లాంటివి అందుకు ఉదాహరణ. గాయాల కావడం వల్ల 2011-16 మధ్య కాలంలో భజ్జీ ప్రభావం నెమ్మదిగా తగ్గింది. బౌలింగ్‌లో పదును లోపించడం సహా పాటు అశ్విన్‌ జట్టులోకి దూసుకు రావడం వల్ల చోటు కూడా గగనమైంది. ఐపీఎల్‌లో ముంబయి తరఫున భజ్జీ ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ జట్టుకు సారథ్యం కూడా వహించాడు. భజ్జీ నాయకత్వంలోనే ముంబయి ఛాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ నెగ్గింది. కొన్నేళ్లకు చెన్నై జట్టుకు మారి అక్కడా సత్తా చాటాడు. భజ్జీ నిష్క్రమించినా ఆఫ్‌స్పిన్‌పై, భారత క్రికెట్‌పై అతడు వేసిన ముద్ర చెరగనిది. భారత క్రికెట్లో అతడి అధ్యాయం మరువలేనిది.

ఇదీ చూడండి : 'రోహిత్​శర్మ సక్సెస్​ఫుల్ కెప్టెన్ అవుతాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.