ETV Bharat / sports

స్టార్​ క్రికెటర్​, మాజీ కెప్టెన్​​ ఆటకు వీడ్కోలు - టిమ్​ పైన్ టెస్ట్​ క్రికెట్​కు వీడ్కోలు

ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్​​ మాజీ కెప్టెన్​​ టిమ్ ​పైన్ రిటైర్మెంట్​ ప్రకటించాడు. ఆ వివరాలు..

Former Australia test cricket captain Tim Paine retires
మాజీ కెప్టెన్ టిమ్​ పైన్​కు​ టెస్ట్​ క్రికెట్​కు రిటైర్మెంట్​
author img

By

Published : Mar 17, 2023, 3:08 PM IST

Updated : Mar 17, 2023, 3:57 PM IST

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్​ టెస్ట్ క్రికెట్​​ మాజీ కెప్టెన్​​ టిమ్ ​పైన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్​లో అతడు ఫస్ట్ క్లాస్​ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్​లో టాస్మేనియాకు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. తన 18 ఏళ్ల బంధానికి ముగింపు పలికాడు. శుక్రవారం షెఫీల్డ్‌ షీల్డ్‌ ట్రోఫీలో భాగంగా క్వీన్స్​ల్యాండ్​తో జరిగిన మ్యాచ్​ అనంతరం తన నిర్ణయాన్ని తెలిపాడు. ఇకపోతే పైన్‌ తన చివరి మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్‌లో 42 రన్స్​ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 3 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. ఇకపోతే మ్యాచ్‌ అయిపోయిన అనంతరం అతడికి సహాచర ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.

టిమ్​పైన్​ 2005లో ఫస్ట్​క్లాస్​లో అరంగేట్రం చేశాడు. ఈ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో టిమ్​పైన్​(295).. టాస్మేనియా తరఫున అత్యధిక ఔట్‌లు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మొత్తంగా 153 మ్యాచులు ఆడాడు. దాదాపు 30 సగటుతో 4వేలకు పైగా రన్స్ సాధించాడు.

2018 నుంచి 2021 వరకు ఆస్ట్రేలియా తరఫున 23 టెస్టులకు కెప్టెన్​గా వ్యవహరించిన టిమ్ పైన్​.. మొత్తంగా కెరీర్​లో 35 టెస్టు మ్యాచులు ఆడాడు. 1,534 పరుగులు సాధించాడు. 2010లో లార్డ్ వేదికగా జరిగిన పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​తో టెస్టులో అరంగేట్రం చేసిన అతడు.. 32.63 సగటుతో అత్యధిక వ్యక్తిగత స్కోరు 92 సాధించాడు టిమ్​ పన్​. అలాగే వికెట్​ కీపర్​గా 157 ఔటలు చేశాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్​లో బాల్ ట్యాంపరింగ్​ వివాదం నేపథ్యంలో స్టీవ్​ స్మిత్​ తర్వాత అతడు ఆస్ట్రేలియాకు 46వ టెస్ట్ కెప్టెన్​గా ఎంపికయ్యాడు. అనంతరం 2021లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇకపోతే కెరీర్​లో 35 వన్డేలు(890 రన్స్​) , 12 టీ20లు కూడా ఆడాడు. అలానే 136 లిస్ట్​-ఏ మ్యాచులు కూడా ఆడాడు.

"అతడు గొప్ప ప్లేయర్​. అతడి ఆట అసాధారణం. చాలా కాలం పాటు తన శాయశక్తులా ఆడుతూనే ఉన్నాడు" అని టాస్మేనియా కెప్టెన్​ జోర్డన్​ సిల్క్ అన్నాడు. కాగా పైన్‌ కెరీర్‌లో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. ముఖ్యంగా ఓ మహిళకు అభ్యంతరకర మెసేజీలు చేసిన 'సెక్స్‌టింగ్' స్కామ్​లో ఇరుక్కున్నాడు. దీంతో అతడు 2021లో కీలకమైన యాషెస్‌ ఆసీస్‌ సిరీస్​లో టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ వివాదం అతడి కెరీర్‌నే మలుపు తిప్పేసింది.

ఇదీ చూడండి: ఇదేం అభిమానం గురూ.. క్రికెట్​ మ్యాచ్​ చూసేందుకు చెట్లు ఎక్కి మరీ!

Last Updated : Mar 17, 2023, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.