ETV Bharat / sports

భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లాండ్- టీ టైమ్​కు స్కోరు 298/3

భారత్​పై ఆతిధ్య జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. టీ బ్రేక్‌ సమయానికి 94 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్​ ఆధిక్యం 220 పరుగులుగా నమోదైంది.

author img

By

Published : Aug 26, 2021, 8:48 PM IST

ind vs eng 3rd test
INDvsENG: టీ బ్రేక్‌.. ఇంగ్లాండ్ 298/3

టీమ్ఇండియాపై ఇంగ్లాండ్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో సెషన్‌లోనూ ఆ జట్టు మెరుగైన ఆటతీరు ప్రదర్శించింది. కెప్టెన్‌ జో రూట్‌(80*), డేవిడ్‌ మలన్‌(70) మూడో వికెట్‌కు 139 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఆ జట్టు టీ బ్రేక్‌ సమయానికి 94 ఓవర్లలో 298/3తో నిలిచింది. ఈ సెషన్‌ ముగిసేముందు సిరాజ్‌ బౌలింగ్‌లో మలన్‌ ఔటయ్యాడు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు ఆధిక్యం 220 పరుగులుగా నమోదైంది.

అంతకుముందు రోరీ బర్న్స్​, హసీబ్​ హమీద్​లు నిలకడగా ఆడి జట్టుకు కీలక భాగస్వామ్యాన్ని అందించారు. రోరీ బర్న్స్ 61(153), హమీద్​ హసీబ్​ 68(195) పరుగులు చేశారు. అయితే షమి వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. 49వ ఓవర్లో షమి వేసిన బంతికి రోరీ క్లీన్ బౌల్డ్​ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని ఒవర్లకే హమీద్​ కూడా పెవిలియన్​ బాటపట్టాడు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.