ETV Bharat / sports

తొలి జట్టుగా ఇంగ్లాండ్‌ అరుదైన ఘనత.. 112 ఏళ్లనాటి రికార్డ్​ బ్రేక్‌ - ఇంగ్లాండ్‌ 112 ఏళ్లనాటి రికార్డు బ్రేక్‌

పాకిస్థాన్​తో ఇంగ్లాండ్​ తొలి టెస్ట్​ మ్యాచ్ అదరగొట్టింది. టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకొన్న ఇంగ్లాండ్‌ను పాక్‌ బౌలర్లు ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. అయితే అద్భుతమైన బ్యాటింగ్​తో ఇంగ్లాండ్​ అరుదైన రికార్డును సొంతం చేసుకొంది.

england
ఇంగ్లాండ్‌
author img

By

Published : Dec 1, 2022, 10:28 PM IST

చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్‌ అదరగొట్టేస్తోంది. రావల్పిండి వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకొంది. మొదటి రోజే 500కిపైగా పరుగులు సాధించిన జట్టుగా అవతరించింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. అదీ.. దాదాపు 112 ఏళ్ల కిందట 1910లో దక్షిణాఫ్రికాపై 494/6 స్కోరు సాధించిది. అయితే గురువారం పాక్‌పై ఇంగ్లాండ్‌ ఏకంగా 506/4 స్కోరు చేయడం విశేషం. ప్రస్తుతం క్రీజ్‌లో హ్యారీ బ్రూక్‌ (101*), బెన్ స్టోక్స్ (34*) ఉన్నారు.

టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకొన్న ఇంగ్లాండ్‌ను పాక్‌ బౌలర్లు ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. ఓపెనర్లు జాక్‌ క్రాలే (122), బెన్‌ డకెట్ (107) తొలి వికెట్‌కు 233 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఔటైనప్పటికీ.. రూట్‌ (23)తో కలిసి ఓలీ పోప్ (108) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

రూట్‌ త్వరగానే పెవిలియన్‌కు చేరినా హ్యారీతో కలిసి పోప్‌ మరోసారి భారీ భాగస్వామ్యం నిర్మించాడు. నాలుగో వికెట్‌కు 182 పరుగులను జోడించాడు. సెంచరీ అనంతరం పోప్‌ పెవిలియన్‌కు చేరాడు. బెన్‌ స్టోక్స్‌ దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్‌ 500 మార్క్‌ను దాటేసింది. తొలి ముగ్గురు బ్యాటర్లు శతకాలు బాదడం మరో విశేషం. పాక్‌ బౌలర్లలో జహిద్‌ మహమ్మద్‌ 2.. హారిస్‌, మహమ్మద్‌ అలీ చెరో వికెట్‌ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.