IPL 2023 CSK Jadeja: చెన్నై జట్టు యాజమాన్యంతో విభేదాల కారణంగా రవీంద్ర జడేజా ఇక ఆ జట్టులో ఉండటం కష్టమే అని అందరూ అనుకున్నారు. అయితే.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ జట్టు ఈ ఆల్‌రౌండర్‌ని అట్టిపెట్టుకుంది. గత సీజన్ మొదట్లో జడేజాకు సారథ్య బాధ్యతలను అప్పగించింది యాజమాన్యం. కానీ, వరుస పరాజయాల నేపథ్యంలో.. అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జడేజాను తొలగించి తిరిగి ధోనీకే కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. అయినప్పటికీ జట్టు భవితవ్యం ఏ మాత్రం మారలేదు. పేలవ ప్రదర్శనతో ఆ జట్టు నాకౌట్ దశకు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. గాయం కారణంగా జడేజా గత సీజన్‌ను పూర్తిగా ఆడలేదు.
ఈ నేపథ్యంలో జడేజాను జట్టులో కొనసాగించడంపై అనుమానాలు రేకెత్తాయి. ఆ తర్వాత జడ్డూ కూడా తన సోషల్‌మీడియా ఖాతాలో చెన్నై జట్టుతో ఉన్న ఫొటోలను తొలగించడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది. అయితే వీటికి తెరదించుతూ యాజమాన్యం తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో జడేజాను చేర్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ పంచుకుంటూ.. 'మాతో ఉండటం ఎనిమిదో వండర్' అంటూ జడేజా ఫొటోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. ఇక జట్టు సాధించిన ఎన్నో అద్భుత విజయాల్లో భాగమైన ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోను చెన్నై వదులుకుంది.
-
Eighth wonder to stay with us! ♾💛#WhistlePodu #Yellove 🦁💛 @imjadeja pic.twitter.com/VlKqhSA4h1
— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Eighth wonder to stay with us! ♾💛#WhistlePodu #Yellove 🦁💛 @imjadeja pic.twitter.com/VlKqhSA4h1
— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2022Eighth wonder to stay with us! ♾💛#WhistlePodu #Yellove 🦁💛 @imjadeja pic.twitter.com/VlKqhSA4h1
— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2022
ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లను కొనసాగించే, వదిలేసే తుది జాబితాను ఇచ్చేందుకు గడువు మంగళవారంతో ముగిసింది. కొనసాగించనున్న ఆటగాళ్ల వివరాలను అన్ని ఫ్రాంఛైజీలు వెల్లడించాయి. టీ20 లీగ్ మినీ వేలం డిసెంబరు 23న కోచిలో జరగనుంది.
చెన్నై తుది జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, శుభ్రాన్షు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, డ్వేన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముకేశ్ చౌదరి, సిమర్‌జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రాజ్‌వర్థన్ హంగర్గేకర్, మిచెల్ సాంట్నర్, మహీషా పతిరాన
వదిలేసిన ఆటగాళ్ల జాబితా : బ్రావో, ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్, ఎన్. జగదీశన్, హరి నిషాంత్, భగత్ వర్మ, ఆసిఫ్, రాబిన్ ఉతప్ప
ఇదీ చదవండి: టెన్నిస్ అభిమానులకు శుభవార్త.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడనున్న జకోవిచ్
ఉమ్రాన్ మాలిక్ టాలెంట్‌పై కేన్ కీలక వ్యాఖ్యలు.. నాన్‌స్ట్రైకర్ రనౌట్‌పై ఏమన్నాడంటే?