టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ చాహల్ భార్య ధనశ్రీ.. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాపై సెటైర్ వేసిందా? ఆమెను ఆటపట్టిస్తుందా? అంటే అవుననే సమాధానం నెటిజన్ల నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే తాజాగా ధనశ్రీ చేసిన పోస్ట్ చూసి సోషల్‌మీడియా యూజర్స్ ఇదే అనుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసిందంటే?
ప్రస్తుతం చాహల్.. టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఆదివారం తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడబోతున్నాడు. అయితే ఆ మ్యాచ్ చూసేందుకు ధనశ్రీ.. ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియాకు చేరుకుంది. అయితే ప్రయాణ సమయంలో ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ ఫొటోను పోస్ట్ చేసింది. 'నా ప్రేమ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నాను. నా భర్త కోసం ఇండియా కోసం అక్కడ ఉండాల్సిందే' అని వ్యాఖ్య రాసుకొచ్చింది.
అయితే ఇటీవలే క్రికెటర్ పంత్‌తో పరోక్షంగా సోషల్‌మీడియా వార్‌కు దిగిన నటి ఊర్వశి రౌతేలా కూడా ఇలాంటి పోస్టే చేసింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ఫొటోను పోస్ట్ చేసి.. "మనసును ఫాలో అయ్యా అది నన్ను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లింది" అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అప్పుడు ఈ పోస్ట్ తెగ వైరల్ అయింది. పంత్ పట్టించుకోకపోయినా అతడి కోసమే ఆమె విదేశాలకు వెళ్తోందని ఊర్వశిని తెగ ట్రోల్ చేశారు. ఇకపోతే వీరిద్దరు పోస్ట్ చేసిన ఫొటోలు గమనిస్తే ఇంచుమించు ఊర్వశిలానే పోజు ఇచ్చింది ధనశ్రీ. దీంతో ధనశ్రీ చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్స్.. ధనశ్రీ కావాలనే ఊర్వశిని ఆటపట్టించడానికి రిక్రియేట్ పోస్ట్ చేసిందని విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.
కాగా, కొంతకాలంగా పంత్-ఊర్వశి రేతేలా మధ్య జరుగుతున్న సోషల్‌మీడియా వార్ తెలిసిందే. వీరిద్దరూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ నెటింట్లో హాట్‌టాపిక్‌గా మారారు. ముఖ్యంగా ఊర్వశి.. పంత్ పేరు ప్రస్తావించకుండానే అతడి గురించి ఏదో ఒకటి పరోక్షంగా పోస్ట్‌లు పెడుతూనే ఉంది. దానికి అతడు కూడా మొదట్లో ఘాటుగానే బదులిచ్చాడు. కానీ ఆ తర్వాత అతడు ఆపేసిన ఊర్వశి మాత్రం పంత్ గురించి పరోక్షంగా పోస్ట్‌లు ఇంకా పెడుతూనే ఉంది.
ఇదీ చూడండి: కత్రినకు విక్కీ పెట్టిన ముద్దు పేరు ఏంటో తెలుసా?