ETV Bharat / sports

ICC ర్యాంకుల్లో అమ్మాయిల జోరు.. టాప్ ప్లేస్​కు దీప్తి ఎసరు.. స్మృతి స్థానం ఎంతంటే?

ఐసీసీ టీ20 మహిళల ర్యాంకింగ్స్​ను మంగళవారం బీసీసీఐ విడుదల చేసింది. బౌలింగ్​ ర్యాంకింగ్స్​లో రెండో స్థానాన్ని టీమ్​ఇండియా ప్లేయర్​ దీప్తి శర్మ కైవసం చేసుకోగా బ్యాటింగ్​లో స్మృతి మందన్న మూడో స్థానానికి చేరుకుంది.

Etv Bharat
deepti sharma and smriti mandanna
author img

By

Published : Jan 31, 2023, 7:12 PM IST

మంగళవారం విడుదలైన ఐసీసీ టీ20 మహిళల బౌలింగ్​ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా ప్లేయర్​ దీప్తి శర్మ రెండో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం వెస్టిండీస్, సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 ట్రై సిరీస్​​లో 9 వికెట్లు తీసి టాప్​లో ఉన్న దీప్తి.. 739 పాయింట్లతో రెండో స్థానాన్ని చేరింది. ఇంగ్లాండ్​కు చెందిన సోఫీ ఎక్కలిస్టోన్​ ​మొదటి స్థానంలో నిలిచింది. సోఫీకి, దీప్తికి మధ్య పాయింట్ల అంతరం 26 మాత్రమే ఉంది. ఇదే ట్రై సిరీస్​లో నాలుగు వికెట్లు తీసిన సౌతాఫ్రికన్​ లెఫ్ట్​ ఆర్మ్ స్పిన్నర్​ నోంకులులెకో మ్లాబా 732 పాయింట్స్​తో మూడో స్థానాన్ని చేజిక్కిచ్చుకుంది.

వీరిద్దరూ తమ ఫామ్‌ ఇలాగే కొనసాగిస్తే, ఫిబ్రవరి 10 నుంచి దక్షిణాఫ్రికాలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందే సోఫీ స్థానానికి ఎసరుపెట్టే అవకాశం ఉంది. కాగా, మరో టీమ్​ఇండియా లెఫ్ట్​ ఆర్మ్ స్పిన్నర్ ​రాజేశ్వరి గైక్వాడ్ తన ర్యాంక్​ను మెరుగుపరుచుకుని 14వ స్థానానికి ఎగబాకింది. అయితే టాప్-10 బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ మేగాన్ షట్..ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకోగా ఇంగ్లాండ్ సీమర్ కేథరీన్ స్కివర్-బ్రంట్ రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచింది.

మరోవైపు ఆస్ట్రేలియా కుడిచేతి వాటం ప్లేయర్​ తహ్లియా మెక్‌గ్రాత్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. టీమ్​ఇండియా ప్లేయర్​ స్మతి మందన్నా మూడో స్థానంలో ఉంది. అయితే భారత్-వెస్టిండీస్‌తో జరిగిన ట్రై-సిరీస్‌లో సౌతాఫ్రికా ప్లేయర్​ లారా వోల్వార్డ్ట్ నాలుగు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకోగా..ఇదే టీమ్​కు చెందిన తజ్మిన్ బ్రిట్స్ అర్ధ సెంచరీ కొట్టి​ 10 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకుంది. వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ నాలుగు స్థానాలు ఎగబాకి 22వ ర్యాంక్‌కు చేరుకుంది.

ఆల్‌ రౌండర్‌ల టాప్-10 జాబితాలో గత ర్యాంకింగ్స్​తో పో లిస్తే కొంత మేరకు మాత్రమే మార్పులు జరిగాయి. అలా ఆస్ట్రేలియా ప్లేయర్​ ఎల్లీస్ పెర్రీ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్​తో 10వ స్థానానికి చేరుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.