ETV Bharat / sports

'కోహ్లీ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది' - Steve Waugh on Virat Kohli

ఆసీస్​ పర్యటనలో టెస్టు సిరీస్​ నుంచి కోహ్లీ తప్పుకోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ స్టీవ్ వా స్పందించారు. అతడి నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు.

Steve Waugh on Virat Kohli missing three Tests against Australia
'కోహ్లీ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది'
author img

By

Published : Nov 10, 2020, 5:51 PM IST

ఆస్ట్రేలియాతో జరగబోయే చివరి మూడు టెస్టులకు టీమ్​ఇండియా కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు. సతీమణి అనుష్క శర్మ ఆ సమయంలో ప్రసవించే అవకాశం ఉన్నందుకు పితృత్వ సెలవు తీసుకున్నాడు విరాట్. ఇప్పుడీ విషయమై మాట్లాడిన దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా.. కోహ్లీ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నాడు.

"అతడి(కోహ్లీ) నిర్ణయంతో కాస్త నిరాశ చెందాను. అలానే ఆశ్చర్యం కలిగింది. అతడి కెరీర్​లో ఇవి మైలురాయి సిరీస్​లుగా మిగిలిపోయే అవకాశం ఉంది. కానీ కుటుంబం కూడా ముఖ్యమే కదా. ఇదో అద్భుత సిరీస్. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో భారత్ గెలిచింది. అప్పుడు వార్నర్, స్మిత్ లేరు. ఇప్పుడు వారు జట్టులోకి తిరిగి వచ్చారు. అందువల్ల ఈసారి హోరాహోరీగా ఉండనుంది. కేఎల్ రాహుల్, బుమ్రా, రహానే ఆట చూడాల్సిందే. కోహ్లీ లేకున్నా భారత్ ప్రమాదకర ప్రత్యర్థి. ఈ సిరీస్​లో కచ్చితంగా తీవ్రమైన పోటీ ఉంటుంది"

-స్టీవ్ వా, ఆసీస్ మాజీ క్రికెటర్

నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు సాగే ఈ పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.