ETV Bharat / sports

హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించాలి: అజారుద్దీన్ - తెలంగాణ వార్తలు

హైదరాబాద్​లో ఐపీఎల్​ నిర్వహించాలని హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ అధ్యక్షుడు మహమ్మద్​ అజారుద్దీన్​ కోరారు. భాగ్యనగరంలో ఐపీఎల్‌ నిర్వహించాలన్న కేటీఆర్‌ విజ్ఞప్తికి మద్దతు పలికారు.

AZARUDDIN
AZARUDDIN
author img

By

Published : Mar 1, 2021, 2:47 PM IST

హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం​ ట్వీట్​ చేశారు. భాగ్యనగరంలో ఇండియన్​ ప్రిమియర్​ లీగ్​ నిర్వహించాలన్న కేటీఆర్​ విజ్ఞప్తికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ మద్దతు ప్రకటించారు. బయోబబుల్ ఏర్పాటు చేయటంతో పాటు బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ నిర్వహించే సత్తా హైదరాబాద్​కు ఉందని ట్వీట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

మెట్రో నగరాల కంటే భాగ్యనగరంలో తక్కువ కొవిడ్​ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. కరోనా కారణంగా 2020లో యూఏఈలో ఐపీఎల్​ నిర్వహించారు. 2021లో స్వదేశంలో లీగ్​ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

కొవిడ్​ పూర్తిస్థాయిలో తగ్గకపోవటంతో ఈసారి చెన్నై, బెంగళూరు, దిల్లీ, కోల్‌కతాతో పాటు అహ్మదాబాద్​లో ఐపీఎల్​ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే ముంబయిలో కూడా నిర్వహించనున్నారు. ముంబయిలో మ్యాచ్‌లు వీలు కాని పక్షంలో హైదరాబాద్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్, జైపూర్, మొహాలీలను పక్కన పెట్టారు.

ఇదీ చదవండి:

'నన్ను అడ్డుకోలేరు... నేను తగ్గేది లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.