ETV Bharat / sports

ఐపీఎల్​లో వార్నర్​తో పాటు ఆసీస్ క్రికెటర్లందరూ - David Warner praised virat kohli

ఐపీఎల్​ వేలంలో ఎంపికైన ఆస్ట్రేలియా క్రికెటర్ల అందరూ ఐపీఎల్​ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు వార్నర్. టీ20 ప్రపంచకప్​ వాయిదా పడితేనే ఇలా జరుగుతుందని అన్నాడు.

David Warner is very sure of playing IPL if T20 World Cup gets postponed
డేవిడ్​ వార్నర్​
author img

By

Published : Jun 21, 2020, 1:12 PM IST

కరోనా ప్రభావంతో ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ వాయిదా పడితే.. తనతో సహా ఆస్ట్రేలియా క్రికెటర్లంతా ఐపీఎల్​లో ఆడతారని చెప్పాడు​ డేవిడ్ వార్నర్​. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచకప్​కు ఆతిథ్యం ఇవ్వడం చాలా కష్టమని అన్నాడు. ఇటీవలే మీడియా ఛానెల్​తో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నాడు.

David Warner is very sure of playing IPL if T20 World Cup gets postponed
డేవిడ్​ వార్నర్​

"ప్రపంచకప్​ నిర్వహణ సాధ్యం కాకపోతే మా వాళ్లంతా ఐపీఎల్​లో పాల్గొంటారు. ఆస్ట్రేలియా బోర్డు అనుమతి లభిస్తే, ఐపీఎల్​కు ఎంపికైన ఆటగాళ్లంతా, టోర్నీలో ఆడతారు. ప్రభుత్వం కూడా ప్రయాణానికి అనుమతలు ఇవ్వాలి. ఇప్పటికే టీ20 ప్రపంచకప్​ వాయిదాపై అనేక చర్చలు జరుగుతున్నాయి. పాల్గొనే ప్రతి ఒక్క దేశాన్నీ ఆస్ట్రేలియాకు తీసుకురావడమంటే సవాలుతో కూడుకున్న పని. దీనితోపాటే 14 రోజుల క్వారంటైన్​ ఉంటుంది"

డేవిడ్​ వార్నర్​, ఆస్ట్రేలియా క్రికెటర్​

కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ పరిస్థితుల్లో.. ప్రపంచకప్​ నిర్వహణపై ఐసీసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు వార్నర్ వెల్లడించాడు. ఈ సంవత్సరం చివర్లో భారత్​తో జరగనున్న టెస్టు సిరీస్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.

కోహ్లీ గురించి చెప్పాలంటే

విరాట్​ కోహ్లి

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీతో ఉన్న స్నేహం గురించి చెప్పిన వార్నర్.. అతడొక అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసించాడు.​

"మైదానం బయట అతడితో ఎన్నో విషయాలు మాట్లాడుతూ. ప్రస్తుతం భారత్​లో నెలకొన్న పరిస్థితుల గురించి మెసేజ్​ల ద్వారా తెలుసుకున్నా. అతడు అద్భుతమైన వ్యక్తి. మేమిద్దరం మైదానంలో చాలా కష్టపడతాం. ఆటలో భాగంగా టీమ్​ కోసం అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం"

-డేవిడ్​ వార్నర్​, ఆస్ట్రేలియా క్రికెటర్​

ఆ వీడియోలు ఎందుకు చేశానంటే

లాక్​డౌన్​ సమయంలో సతీమణి క్యాండీస్​తో టిక్​టాక్​ వీడియోలు చేసి అలరించిన వార్నర్​.. అవి చేయడానికి గల కారణాలను తెలిపాడు. కష్టకాలంలో ఉన్నవారి ముఖాలపై చిరునవ్వులు తెప్పించేందుకే ఆ వీడియోలు చేశానని అన్నాడు.

ఇదీ చూడండి:'భారత్​తో సిరీస్​ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.