ETV Bharat / sports

Icc Rankings: అగ్రస్థానానికి బాబర్​.. బుమ్రా దూకుడు - కోహ్లీ టీ20 ర్యాంకింగ్స్​

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​ అగ్రస్థానానికి చేరుకోగా.. టీమ్​ఇండియా సారథి కెప్టెన్​ కోహ్లీ మాత్రం పాత ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. బుమ్రా మాత్రం ఏకంగా పది స్థానాలను మెరుగుపరచుకోవడం విశేషం.

icc rankings
కోహ్లీ బుమ్రా
author img

By

Published : Nov 3, 2021, 2:31 PM IST

Updated : Nov 3, 2021, 2:51 PM IST

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. బ్యాటింగ్​ విభాగంలో టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ ఐదో ర్యాంకులోనే ఉండగా.. పాకిస్థాన్​ సారథి బాబర్​ అజామ్​(834 పాయింట్ల).. ఇంగ్లాండ్​ ఆటగాడు డేవిడ్​ మలన్​ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్​లో భాగంగా రెండు వరుస హాఫ్​సెంచరీలు చేసి(అఫ్గానిస్థాన్​పై 51, నమీబియాపై 70 పరుగులు) ఈ ఘనతను అందుకున్నాడు. తన కెరీర్​లో ఈ ఫీట్​ను అందుకోవడం ఇది ఆరోసారి. ఇక భారత జట్టులో ఓపెనర్ కేఎల్​ రాహుల్​ ఎనిమిది ర్యాంకులోనే ఉండగా.. సీనియర్​ ఓపెనర్​ రోహిత్​ శర్మ మాత్రం తన ర్యాంకును మెరుగుపరచుకుని 23వ స్థానానికి ఎగబాకాడు.

babar azam
బాబర్ అజామ్

బౌలింగ్​ విభాగంలో బుమ్రా ఏకంగా పది స్థానాలు ముందుకు జరిగి 24వ ర్యాంకులో నిలవగా.. కెరీర్​లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు శ్రీలంక లెగ్​ స్పిన్నర్​​ వనిందు డి సిల్వా. టీ20 ప్రపంచకప్​లో భాగంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​ల్లో వరుసగా మూడు వికెట్ల ప్రదర్శన చేసి ఈ మార్క్​ను అందుకున్నాడు.

ఆల్​రౌండర్​ విభాగంలో షకీబ్​ అల్​ హసన్​ను వెనక్కినెట్టి అఫ్గానిస్థాన్​ ఆటగాడు మహ్మద్​ నబీ అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంక ప్లేయర్​ వనిందు డి సిల్వా నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నాడు.

ఇదీ చూడండి: IND VS AFG T20: ఈ రికార్డులపై ఓ లుక్కేయండి!

Last Updated : Nov 3, 2021, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.