ETV Bharat / sports

లార్డ్స్​లో 'శతక్కొట్టిన' అగార్కర్.. టీమ్ఇండియా చీఫ్ సెలక్టర్ రికార్డులు తెలుసా? - అజిత్​ అగార్కర్​ టెస్టు కెరీర్​

Ajit Agarkar Career : ఇటీవలే బీసీసీఐ సీనియర్ మెన్స్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా భారత జట్టు మాజీ ఆల్​రౌండర్​ అజిత్​ అగార్కర్​ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి నెటిజెన్స్​ తెగ వెతికేస్తున్నారట. మరి ఆయన పేరిట ఉన్న ట్రాక్​ రికార్డుల ఏవంటే..

BCCI New Chief Selector Ajith Agarkar Cricket Track Records
ఒకే టీమ్​ చేతిలో ఐదుసార్లు డకౌట్​.. బీసీసీఐ కొత్త సెలక్టర్​ ట్రాక్​ రికార్డ్​ ఇదే..
author img

By

Published : Jul 6, 2023, 6:26 PM IST

Ajit Agarkar BCCI : భారత సీనియర్‌ పురుషుల క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా టీమ్‌ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌ను నియమిస్తూ బీసీసీఐ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ట్రాక్​ రికార్డును తెలుసుకోవడానికి నెటిజెన్లు పెద్ద ఎత్తున సెర్చ్​ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో అజిత్​ అగార్కర్​ అంతర్జాతీయ క్రికెట్​ కెరీర్​కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం.

Ajit Agarkar Cricket Career : 1997 లో మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించాడు అజిత్ అగార్కర్​. 1998లో అంతర్జాతీయ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్​.. 1998-2007 మధ్య 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20లు ఆడాడు. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి వరుసగా 288, 58, 3 వికెట్లు పడగొట్టాడు. 1999, 2003, 2007 వన్డే ప్రపంచకప్‌ల్లో భారత జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. 2007లో ధోనీ సారథ్యం వహించిన జట్టు ఉన్న అగార్కర్​.. జట్టు గెలుపులో కీలక బాధ్యతలు పోషించాడు. అయితే అజిత్ ప్రధానంగా బౌలర్‌ అయినప్పటికీ.. అప్పుడప్పుడు రైట్​ హ్యాండ్​ బ్యాటర్​గానూ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ క్రమంలో లార్డ్స్‌ టెస్టులో శతక్కొట్టిన ఈ స్టార్​ ప్లేయర్​ రికార్డులివి..

  • 2002లో లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్​ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అజిత్ అగార్కర్‌ (109) 190 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో శతకం బాదాడు. అయితే లార్డ్స్‌లో సెంచరీ బాదిన అతి కొద్దిమంది భారత క్రికెటర్లలో ఒకడిగా అజిత్​ నిలిచాడు.
  • వన్డే క్రికెట్‌ చరిత్రలో భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన అర్ధ శతకం బాదిన రికార్డు కూడా అజిత్ అగార్కర్‌ పేరిటే ఉంది. 2000లో జింబాబ్వేపై 21 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 7 ఫోర్ల సాయంతో 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఆ రికార్డును ఎవరూ బ్రేక్​ చేయకపోవడం విశేషం.
  • వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డు నెలకొల్పాడు. 23 మ్యాచ్‌ల్లోనే అగార్కర్‌ ఈ మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో అతడు మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
  • వన్డే క్రికెట్‌లో 1000కి పైగా పరుగులు సాధించడమే కాకుండా.. 50 వికెట్లు, 50 క్యాచ్‌లు అందుకున్న ఎనిమిది మంది భారత క్రికెటర్లలో ఒకడిగా అజిత్ అగార్కర్‌ ఉన్నాడు.
  • వన్డేల్లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసి 100కు పైగా వికెట్లు తీసిన 10 మంది భారత ఆటగాళ్ల జాబితాలోనూ అగార్కర్‌కు చోటు ఉంది.
  • 2004లో అడిలైడ్ ఓవల్‌ మైదానంలో ఆస్ట్రేలియాపై 6/41తో అగార్కర్‌ సత్తా చాటాడు. అతని టెస్టు కెరీర్‌లో ఇదే ఏకైక ఆరు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • టెస్టు క్రికెట్‌లో వరుసగా ఐదుసార్లు డకౌట్‌ అయిన చెత్త రికార్డు కూడా అజిత్​ పేరిటే ఉంది. అది కూడా ఆసీస్​ చేతిలోనే ఔట్​ కావడం గమనార్హం. ఆస్ట్రేలియన్​ మాజీ క్రికెటర్​ బాబ్ హాలండ్, పాకిస్థాన్​ మాజీ ఆటగాడు మహ్మద్‌ ఆసిఫ్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
  • ఇవీ చదవండి:
  • IPL 2022: దిల్లీ క్యాపిటల్స్​ కోచ్​లుగా షేన్ వాట్సన్​, అగార్కర్​!
  • టీమ్​ఇండియా కొత్త బౌలింగ్​ కోచ్​గా అగార్కర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.