Journalist Boria Majumdar ban: ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు బోరియా మజుందార్‌పై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). క్రికెటర్ వృద్ధిమాన్ సాహాను అతను బెదిరించినందుకు గానూ ఈ మేరకు చర్యలు తీసుకుంది. అతడ్ని భారత క్రికెట్‌తో సంబంధమున్న ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని సూచించింది బీసీసీఐ.
BCCI Ban journalist Boria Majumdar: కొద్ది రోజుల క్రితం సాహాపై తీవ్ర విమర్శలు చేశాడు బోరియా మజుందార్. అతను అడిగినా ఇంటర్వ్యూ ఇవ్వలేదనే కోపంతో సాహాను బెదిరించాడు. దీనిపై విచారణకు బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. దర్యాపు జరిపిన ఈ బృందం సాహాను మజుందార్ బెదిరించింది నిజమే అని నివేదికలో తెలిపింది. అనంతరం బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది. మజుందార్‌ను రెండేళ్ల పాటు నిషేధిస్తున్నట్లు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో తనను ఓ జర్నలిస్టు బెదిరించాడని సాహా తెలిపాడు. ఇందుకు సబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేశాడు. అయితే అప్పుడు జర్నలిస్టు పేరును మాత్రం వెల్లడించలేదు. కానీ ఆ పని చేసింది మజుందార్ అని తర్వాత తెలిసింది.
ఇదీ చదవండి: క్రికెట్ అకాడమీ కోసం ప్లాట్.. 33ఏళ్ల తర్వాత రిటర్న్ ఇచ్చిన గావస్కర్