టీమ్ఇండియా తదుపరి ప్రధాన కోచ్ ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి.. పదవీకాలం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అనంతరం ముగుస్తుంది. రాహుల్ ద్రవిడ్ ఆ పదవి చేపట్టే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌ను ప్రధాన కోచ్ పదవి వరించే అవకాశం కనబడుతోంది.
అక్టోబరు-నవంబరులో రవిశాస్త్రి పదవీ కాలం ముగుస్తుండగా.. మరోసారి ఆ పదవి చేపట్టబోనని ఆయన ఇదివరకే సంకేతాలిచ్చినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్‌గా ఉన్న ద్రవిడ్ పదవీ కాలం కూడా త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆ పదవికి బీసీసీఐ ప్రకటన జారీచేయగా.. ద్రవిడ్ మరోసారి దరఖాస్తు చేసకున్నాడు. దీంతో రవిశాస్త్రి సహా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సన్నిహితుడిగా పేరున్న విక్రమ్ రేసులోకి వచ్చాడు.
విక్రమ్ తదుపరి ప్రధాన కోచ్ అయితే జట్టులో మంచి సమన్వయం ఏర్పడుతుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై బీసీసీఐ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదీ చూడండి: ద్రవిడ్ ఎన్సీఏలో కోచ్‌లకు 'కొత్త పాఠాలు'